అగ్రరాజ్యాన్ని భయపెడుతున్న ‘అమీబా’

29 Sep, 2020 17:00 IST|Sakshi

నీటిలో మెదడును తినే అమీబా

వాషింగ్టన్‌/టెక్సాస్‌: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అత్యధిక కేసులతో అగ్రరాజ్యం అమెరికా కకావికలమై పోతుంది. పుండు మీద కారం చల్లినట్లు ఇప్పుడు మరో కొత్త సమస్య వెలుగు చూసింది. మెదడుకు ఘోరమైన నష్టం కలిగించే.. సరిగా చెప్పాలంటే మెదడును తినే అమీబాను ఒకదాన్ని స్థానిక నీటి సరఫరా వ్యవస్థలో గుర్తించారు టెక్సాస్‌ అధికారులు. ఈ అమీబా కారణంగా ఇప్పటికే ఓ ఆరేళ్ల బాలుడు మరణించడంతో ఇక్కడి ప్రభుత్వం విపత్తు ప్రకటనను జారీ చేసింది. జాక్సన్‌ సరస్సులో నీటిని పరీక్షించిన తర్వాత దానిలో మెదడును తినే అమీబా చేరినట్లు సీడీసీ నిపుణులు వెల్లడించారు. వివరాలు.. ఆరేళ్ల జోసియా మైక్‌ ఇంటైర్‌ కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యి మరణించాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జోసియా తలలో అరుదైన మెదడును తినే అమీబాను గుర్తించారు. దీని కారణంగానే అతడు మరణించినట్లు వెల్లడించిన వైద్యులు మూలాలను కనుగోనే ప్రయత్నం చేశారు.
 
ఈ క్రమంలో జాక్సన్‌ సరస్సులో ఈ అమీబా బయటపడింది. జోసియా ఈ నీటితో ఆడటం లేదా తాగడం చేసినప్పుడు అమీబా తలలోకి చేరి.. మరణానికి దారి తీసిందని వెల్లడించారు వైద్యులు. నీరు తాగినప్పుడు అమీబా ముక్కు నుంచి మెదడులోకి వెళ్లి క్రమంగా తినడం ప్రారంభిస్తుందని తెలిపారు. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మరణం తప్పదని హెచ్చరించారు. దాతో అధికారులు ప్రజలు ఎవరూ కూడా టాప్ వాటర్ తాగొద్దని, వంట చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. స్నానం ఇతర అవసరాలకు నీటిని వాడాలంటే కాసేపు కుళాయిలను ఒపెన్‌ చేసి ఉంచాలని సూచించారు. అత్యవసరమైతే బాగా వేడి చేసిన తర్వాతే తాగడానికి వాడాలని సూచించారు. ప్రస్తుతం ఇక్కడ క్లోరినేషన్‌ జరుగుతుది. (చదవండి: మరో భయకరమైన వ్యాధి మహారాష్టలో హై అలర్ట్‌)

నీటిని ఇష్టపడే అమీబా తరచుగా వెచ్చని సరస్సులు, నదులు, హోస్ట్ స్ప్రింగ్‌లలో కనిపిస్తుంది అన్నారు అధికారులు. ఈ ప్రదేశాలలో ఈత కొట్టేటప్పుడు ప్రజలు సాధారణంగా వ్యాధి బారిన పడతారు. ఎందుకంటే సూక్ష్మజీవి ముక్కు పైకి చేరి అక్కడి నుంచి మెదడులోకి ప్రయాణిస్తుంది. అక్కడ ఇది కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఫలితంగా మెదడు వాపు, మరణానికి కారణమవుతుంది. ఇక ఈ వ్యాధి సోకినవారిలో తలనొప్పి, జ్వరం, వాంతులు, సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా