భర్తపై ఎనలేని ప్రేమ.. 41 ఏళ్లుగా

10 Dec, 2020 19:09 IST|Sakshi
ట్రేసీ హౌవెల్‌ షేర్‌ చేసిన లంచ్‌ ఫొటో

టెక్సాస్‌ : నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ భార్య. తన భర్త అన్న చిన్న మాటను ఆలోచనగా మలిచి 41 ఏళ్లుగా ప్రేమను లంచ్‌ రూపంలో పంచిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌కు చెందిన ట్రేసీ హౌవెల్‌కు క్లిపొర్డ్‌ అనే వ్యక్తితో 41ఏళ్ల క్రితం వివాహం అయింది. మొదటి రోజు నుంచి ఆఫీసుకు వెళ్లే తన భర్తకు లంచ్‌ బాక్స్‌ తయారుచేసేది. ఓ రోజు భర్తతో పాటు ఆఫీసుకు వెళ్లిన ఆమె అతడితో కలిసి భోజనం చేసింది. ఆ తర్వాత ఆమె భర్త ‘మనం ప్రేమించే వారితో కలిసి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది’ అని అన్నాడు.  దీంతో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ( వైరల్‌: నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి..)

ఆ తర్వాతినుంచి అతడి కోసం లంచ్‌ బాక్స్‌ తయారుచేసిన తర్వాత అందులోంచి ఓ కొంత ఆమె తినేది. ఎవరో తన ఆహారాన్ని తిన్నారని భర్త చెప్పగా.. ‘నీతో కలిసి భోజనం చేయలేకపోతున్నందుకు నేనే అందులోంచి కొంత తిన్నాను’ అని అంది. అతడికి విషయం అర్థమైంది. అలా 41 ఏళ్లుగా చేస్తూనే ఉంది. కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌ వేదికగా తన అనుభవాలను పంచుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్‌ చేసింది.  ఆమె పోస్ట్ ప్రస్తుతం‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ( ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు