చంద్రుడిపై శృంగారం కోసం రూ.150 కోట్ల విలువైన దొంగతనం

23 Apr, 2021 20:23 IST|Sakshi
మూన్‌ రాక్‌ని దొంగిలించిన థాడ్‌ రాబర్ట్స్‌ (ఫోటో కర్టెసీ: టైమ్స్‌నౌ)

వాషింగ్టన్‌: కొందరు చేసే తింగరి పనులు చేస్తే ఎలా స్పందించాలో కూడా అర్థం కాదు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని గురించి తెలిస్తే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇతగాడికి చంద్రుడి మీద శృంగారం చేయాలనే కోరిక కలిగింది. అందుకోసం అతడి చేసిన పని గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు 19 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు.. థాడ్ రాబర్ట్స్ 2002 లో అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్‌ నాసా ఇంటర్న్‌షిప్‌ చేశాడు‌. అతడి గర్ల్‌ఫ్రండ్‌ టిఫాని ఫ్లవర్స్‌ కూడా అక్కడే ఇంటర్న్‌షిప్‌ చేసింది. ఈ క్రమంలో వారికి ఓ వింత కోరిక కలిగింది. చంద్రుడి మీద శృంగారం చేయాలని భావించారు. ఇది సాధ్యం కాదని వారికి తెలుసు. 

దాంతో నాసా అపోలో వ్యోమనౌక ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి భూమి మీదకు తీసుకువచ్చిన రాళ్లపై వారిపై కన్ను పడింది. ఎలాగైనా వాటిని దొంగిలించి.. తమ బెడ్‌ మీద పెట్టుకుని.. వాటిపై పడుకుని.. తమ కల నేరవేర్చుకోవాలని భావించారు. ఈ క్రమంలో మరో స్నేహితుడితో కలిసి.. తన ఐడీలతో అర్థరాత్రి పూట బిల్డింగ్‌లోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాళ్లను దొంగతనంగా తమ గదికి తీసుకెళ్లి.. వారి కోరిక తీర్చుకున్నారు. 

ఇక ఈ రాళ్లకు చాలా విలువ ఉంటుంది. మూన్‌ రాక్‌ ఒక్కగ్రాము ధర 5 వేల డాలర్లు(3,75,013 రూపాయలు) పలుకుతుంది. ఇక వీరు దొంగతనం చేసిన శాంపిల్‌ ఖరీదు 21 మిలియన్‌ డాలర్ల(157,69,24,650 రూపాయలు) విలువ చేస్తుంది. ఓ బెల్జియన్‌ ఔత్సాహిక ఖనిజ శాస్త్రవేత్త ఈ మూన్‌ రాక్‌ని కొనడానికి ఉత్సాహం చూపాడు. అయితే వీరి ప్రయత్నానికి నాసా బ్రేక్‌ వేసింది. మూన్‌ రాక్స్‌ దొంగిలించబడినవి అని గుర్తించిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి విచారణ చేయగా రాబర్ట్స్‌, అతడి బ్యాచ్‌ చేసిన నిర్వాకం గురించి తెలిసింది. వీరిపై పోలీసు కేసు నమోదు చేశారు. కోర్టు రాబర్ట్స్‌కి ఎనిమిదేళ్ల శిక్ష విధించింది.  

ఇక జైలులో ఉన్న కాలంలోరాబర్ట్స్ భౌతికశాస్త్రం, మానవ శాస్త్రం, తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు అతడి వయసు 44 సంవత్సారు. ప్రస్తుతం అతను ఓ ప్రముఖ కంపెనీలో అత్యున్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. 

చదవండి: నువ్వు నిజమైన జాతిరత్నానివి సామి!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు