పార్ల‌మెంటులో పోర్న్ ఫొటోలు చూసిన ఎంపీ

18 Sep, 2020 18:49 IST|Sakshi
ఫోన్‌లో పోర్న్ చూస్తున్న ఎంపీ (ఫొటో క్రెడిట్‌: డెయిలీ మెయిల్‌)

బ్యాంకాక్‌: పార్ల‌మెంటు హాలులో ద‌ర్జాగా పోర్న్ ఫొటోలు చూస్తూ ఓ ఎంపీ అడ్డంగా దొరికిపోయిన‌‌‌ ఘ‌ట‌న థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. దేశ ‌రాజ‌ధాని బ్యాంకాక్‌లోని పార్ల‌మెంటు భ‌వ‌నంలో ప్ర‌స్తుతం బ‌డ్జెట్ స‌మావేశాలు న‌డుస్తున్నాయి. ఈ స‌మ‌యంలో అక్క‌డే హాలులో ఉన్న ఓ ఎంపీ రొన్నాతెప్ అనువాత్ ఫేస్ మాస్క్ తీసి కూర్చున్నారు. ఓ వైపు ముఖ్య‌మైన స‌మావేశం జ‌రుగుతుంటే ఆయ‌న మాత్రం ఫోన్‌లో పోర్న్ ఫొటోలు చూడ‌టంలో లీన‌మ‌య్యారు. అలా 10 నిమిషాల వ‌ర‌కు ఫోన్‌లోనే ముఖం పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఖంగు తిన్న ఎంపీ త‌న త‌ప్పిదాన్ని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. (చ‌ద‌వండి: నువ్వు మూర్ఖుడివే.. అదే తగిన శాస్తి!)

త‌న‌కు కొంద‌రు అమ్మాయిల నుంచి సాయం కోరుతూ, డ‌బ్బు ఇవ్వ‌మ‌ని ప్రాధేయ‌ప‌డుతూ మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌న్నారు. అయితే వారు నిజంగా అలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో లేదా ప్ర‌మాదంలో ఉన్నారా? లేదా అని తెలుసుకునేందుకు చెక్ చేశాన‌ని చెప్పుకొచ్చారు. అందుకోస‌మే వారి ఫొటోలు ఓపెన్ చేసి వారి బ్యాక్‌గ్రౌండ్ ప‌రిశీలించాన‌ని వింత స‌మాధాన‌మిచ్చారు. అయితే ఆ అమ్మాయిలు కావాల‌నే డ‌బ్బులు కోరార‌ని అర్థ‌మ‌వ‌గానే ఆ ఫొటోల‌న్నింటినీ డిలీట్ చేసిన‌ట్లు తెలిపారు ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి పార్ల‌మెంట్ స్పీక‌ర్ చ‌వాన్ లీక్పై మాట్లాడుతూ అది అత‌ని వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని కొట్టిపారేశారు. దీనిపై ఇత‌ర ఎంపీలు ఎవ‌రూ అభ్యంత‌రం తెల‌ప‌నందున స‌ద‌రు ఎంపీపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. (చ‌ద‌వండి: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌: వారికి ఓదార్పు సలహా)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా