మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు..

20 Dec, 2022 07:33 IST|Sakshi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ సముద్రజలాల్లో ఆ దేశ యుద్ధనౌక ఒకటి మునిగిపోయింది. ఆ ఘటనలో 75 మందిని కాపాడారు. అయితే 31 మంది నావికుల జాడ తెలియాల్సి ఉంది. వీరి కోసం థాయ్‌లాండ్‌ నావికాదళ హెలికాప్టర్లు, నౌకల్లో సైన్యం అన్వేషణ పనుల్లో నిమగ్నమైంది. ప్రచుయాప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లోని బాంగ్‌సఫాన్‌ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో హెచ్‌టీఎంఎస్‌ సుఖోథాయ్‌ యుద్ధనౌక గస్తీ కాస్తోంది.

ఆ ప్రాంతంలో వేటకొచ్చే చేపలపడవల సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాల బాధ్యతలను ఈ నౌక చూసుకునేది. ఆదివారం రాత్రి భారీ అలలు ఈ నౌకను అతలాకుతలం చేశాయి. సముద్రనీరు చేరడంతో నౌకలో విద్యుత్‌ వ్యవస్థ స్తంభించడంతో నావికులు నౌకను అదుపుచేయడంలో విఫలమయ్యారు. దీంతో పక్కకు ఒరగడం మొదలై పూర్తిగా మునిగిపోయింది. 75 మందిని కాపాడగా మిగతా వారి గాలిస్తున్నారు.
చదవండి: పాకిస్తాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి..

మరిన్ని వార్తలు