ఆన్‌లైన్‌లో జోంబీ వేషంతో..

29 Oct, 2020 15:58 IST|Sakshi

బ్యాంకాక్: ఆన్‌లైన్‌లో బట్టల వ్యాపారం క్లిక్‌ అయ్యేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. కస్టమర్‌లను ఆకర్షించేందుకు ఆమె భయంకరమైన వేషధారణతో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. థాయ్‌లాండ్‌కు చెందిన కనిట్టా థాంగ్నాక్(32) అనే మహిళ మరణించిన వారికి అవసరమైన వస్రాలను ఆన్‌లైన్‌ ‌ద్వారా విక్రయించేది. అందుకోసం ఆమె భయానకంగా జోంబీ వేషం వేసింది. ఈ జోంబీ మేకప్‌తో అర్థరాత్రి ఆన్‌లైన్‌ ద్వారా వివిధ రకాలుగా మరణించిన వారు ఎలా చనిపోయోరో ఆమె వద్ద ఉన్న దుస్తులతో వివరింస్తుంది. దీంతో ఆమెకు ఆన్‌లైన్‌ ప్రేక్షకులు పెరగడమే కాకుండా.. కస్టమర్‌ల సంఖ్య కూడా వేలకు చేరింది. దీంతో ఆమె వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. (చదవండి: జంతువులు నేర్పిన పాఠం ..వీడియో వైరల్‌) 

దీనిపై థాంగ్నాక్‌ మాట్లాడుతూ.. నా దగ్గర ఉన్న బట్టలు మరణించిన వారికి ఎలా ఉపయోగిపడతాయో... వాటిని నేను జోంబో మేకప్‌తో ధరించి ఆన్‌లైన్‌ ద్వారా ప్రేక్షకులకు వివరించడం ప్రారంభించాను. వాటిని నేను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుండేదాన్ని. దీంతో అప్పటి నుంచి కస్టమర్‌లు కొంచంగా కొంచంగా ఆసక్తి చూపారు. అంతేగాక ఆన్‌లైన్‌ ప్రేక్షకులు కూడా పెరిగారు. ఈ జోంబీ మేకప్‌ వేసుకునేందుకు తనకు మూడు గంటల సమయం పెట్టేదని కూడా తెలిపింది.తన ఆదాయంలో కొంత భాగాన్నిబౌద్ధ దేవాలయాలకు విరాళంగా ఇస్తానని ఆమె పేర్కొంది. (చదవండి: వాలిబాల్‌ ఆడుతున్న పక్షులు.. గెలిచేదెవరు?)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు