ప్రపంచంలో బెస్ట్‌ సిటీ ‘వెలెన్సియా’.. టాప్‌ 10 నగరాలివే..  

1 Dec, 2022 04:54 IST|Sakshi

న్యూయార్క్‌: మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్‌నేషన్స్‌ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో  ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్‌లోని వెలెన్సియా టాప్‌లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు.

టాప్‌ 10 నగరాలివే..  
1. వెలెన్సియా (స్పెయిన్‌): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం.
2. దుబాయ్‌: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్‌ చేయొచ్చు.
3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం.
4. లిస్బన్‌ (పోర్చుగల్‌): అద్భుత వాతావరణం.
5. మాడ్రిడ్‌ (స్పెయిన్‌): సాంస్కృతిక అద్భుతం.
6. బాంకాక్‌: సొంత దేశంలో ఉండే ఫీలింగ్‌.
7. బాసిల్‌ (స్విట్జర్లాండ్‌): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి
8. మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్‌.
9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్‌. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం.
10. సింగపూర్‌: మంచి కెరీర్‌.
రోమ్‌ (ఇటలీ), టోక్యో (జపాన్‌), మిలన్‌ (ఇటలీ), హాంబర్గ్‌ (జర్మనీ), హాంగ్‌కాంగ్‌ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది.

మరిన్ని వార్తలు