వైరల్‌‌‌: లైవ్‌లో రిపోర్టర్‌; ఫోన్‌ ఎత్తుకెళ్లిన దొంగ

27 Oct, 2020 12:40 IST|Sakshi

అర్జెంటినా: అర్జెంటినాలో షాకింగ్‌ సంఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్న రిపోర్టర్‌ సెల్‌ఫోన్‌ను దొంగలించిన వీడియోలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వీపరితంగా వైరల్‌ అవుతోంది. డియోగో డెమార్కో సరండి నగరం నుంచి లైవ్‌ న్యూస్‌ అందించేందుకు సిద్దంగా ఉన్న రిపోర్టర్‌ ఫోన్‌ను ఓ వ్యక్తి అకస్మాత్తుగా లాక్కుని పారిపోతున్న వీడియో అదే లైవ్‌ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అక్కడి స్థానిక న్యూస్‌ ఛానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్న డెమార్కోను మంగళవారం న్యూస్‌ స్టేషన్‌ నుంచి యాంకర్‌ రిపోర్టింగ్ ఇవ్వా‍ల్సిందిగా చెప్పారు. దీంతో అతడు లైవ్‌‌ న్యూస్‌ అందించేందుకు సిద్దంగా ఉన్న రోలింగ్‌ కెమారాతో మాట్లాడబోతుండగా ఆకస్మాత్తుగా  దొంగ వచ్చి అతడి చేతిలో ఉన్న సెల్‌ ఫోన్‌ లాక్కెల్లాడు. (చదవండి: వైరల్‌ వీడియో.. 60 గుడ్లతో ఆమ్లెట్‌)

వెంటనే రిపోర్టర్‌ లైవ్‌ వదిలేసి దొంగ వెనక పరుగెత్తాడు. ‘నా ఫోన్‌ దొంగించాడు.. ఫోన్‌ ఇచ్చేయ్‌’ అంటూ స్పానిష్‌లో అరుస్తూ దొంగ వెనక పరుగెత్తాడు. అయితే అదృష్టవాత్తు ఆ ‌ స్థానికులు సహాయంతో రిపోర్టర్‌ తన ఫోన్‌ను తిరిగి పొందాడు. ఆ దొంగ స్థానికుడే కావడంతో రిపోర్టర్‌కు అక్కడి ప్రజలు దొంగ ఆచూకి తెలిపారు. దీంతో కాసేపటికే తన ఫొన్‌ తిరిగి పొందడంపై రిపోర్టర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ‘అదృష్టవశాత్తు నా ఫోన్‌ నాకు దొరికిందని, ఇందుకు తాను కృతజ్ఞుతుడి అని పేర్కొన్నాడు. అయితే తను దొంగను పట్టించాలనుకోవడం లేదని,  ఫోన్‌ దొరికితే చాలు అని చాలు అనుకునకున్నానని చెప్పాడు. (చదవండి: ఒళ్లంతా తేనెటీగ‌ల‌తో.. షాకింగ్ వీడియో)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు