స్కాట్లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

24 Aug, 2022 07:08 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌లోని స్కాట్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులున్నారు. హైదరాబాద్‌కు చెందిన పవన్‌ బాశెట్టి(23), ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన మోదేపల్లి సుధాకర్‌(30)లతో పాటు బెంగళూరుకు చెందిన గిరిశ్‌ సుబ్రమణ్యం(23), దుర్మరణం చెందారు. హైదరాబాద్‌కు చెందిన సాయి వర్మ(24) ఇంకా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

లీసెస్టర్‌ యూనివర్సిటీలో పవన్, గిరిశ్‌ ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ చదువుతున్నారు. వారి స్నేహితుడు, సుధాకర్‌ వర్సిటీ మాజీ విద్యార్థి. శుక్రవారం మధ్యాహ్నం స్కాట్లాండ్‌లోని ఆర్గిల్‌ కౌంటీలోని అప్పీన్‌ ఏరియాలో ఏ828 రహదారిపై క్యాసెల్‌ స్టేకర్‌ సమీపంలో భారీ సరకు రవాణా వాహనం, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారని స్కాట్లాండ్‌ పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: భారత విద్యార్థులకు శుభవార్త.. వీసాల జారీపై చైనా కీలక ప్రకటన

మరిన్ని వార్తలు