Sri Lanka Navy Ship Video: సూట్‌ కేసులతో పరుగులు... ఇవి రాజపక్సవేనా?

9 Jul, 2022 18:35 IST|Sakshi

Suitcases Loaded On Sri Lanka Navy Ship: శ్రీలంక రాజధాని కొలంబోలో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆందోళనకారులు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టారు కూడా. ఈ మేరకు వారంతా ఆయన కార్యాలయం, అధికార నివాసం రెండింటిని ఆక్రమించారు. ఈ నేపథ్యంలో గోటబయ పరారయ్యరంటూ పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన పెద్ద పెద్ద సూట్‌కేసులు తీసుకుని శ్రీలంక నేవీ ఓడలో పారిపోయారంటూ.. వార్తలు గుప్పుమన్నాయి.

అందుకు సంబంధించిన పోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద  సూట్‌కేసులతో ఎస్‌ఎల్ఎన్‌ఎస్‌ గజబాహు అనే నేవీ ఓడలో తీసుకువెళ్తున్నట్లు వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ విషయమై కొలంబో పోర్ట్‌లోని అధికారిని ప్రశ్నించగా...ఆయన కూడా ఒక బృందం పెద్ద పెద్ద సూట్‌కేసులతో గజబాహు అనే ఓడ ఎక్కి వెళ్లినట్లు తెలిపారు.

అంతేకాదు ఈ విషయాన్ని శ్రీలంక స్థానిక మీడియా వెల్లడించింది కూడా. ఐతే అతనితోపాటు ఎవరెవరు వెళ్లారు, ఎలా వెళ్లాడనేది వివరణ ఇవ్వలేదు. మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ ఆయన్ని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు పేర్కొంది. పైగా శ్రీలంకలోని కొన్ని మీడియా సంస్థలు అధ్యక్క్షుడు పరారయ్యడంటూ... విమానాశ్రయంలోని లంక అధ్యక్షుడు గోటబయ కాన్వాయ్‌ని చూపిస్తూ... వార్తలు ప్రసారం చేశాయి. కానీ లంక అధ్యక్షుడు గోటబయ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారో లేదా అనేది స్పష్టం కాలేదు. 

(చదవండి: ఇంటి నుంచి పరారైన శ్రీలంక అధ్యక్షుడు!)

మరిన్ని వార్తలు