టిక్‌టాక్ పై కేసు వేసిన 12 ఏళ్ల బాలిక! 

31 Dec, 2020 20:53 IST|Sakshi

ఈ 2020 ఏడాది చాలా కంపెనీలకు కఠినమైన సంవత్సరంగా మిగిలిపోనుంది. అన్ని దేశాల కంపెనీల కంటే చైనా దేశాలకు చెందిన సంస్థలకు గడ్డు సంవత్సరంగా మిగిలిపోనుంది. ఇంకా చెప్పాలంటే చాలా పాపులర్ అయిన టిక్‌టాక్‌ యాప్ పేరెంట్ కంపెనీ బైట్‌డాన్స్‌కు చాలా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. భారతదేశంలో నిషేధించబడటం నుండి యుఎస్ఎలో నిషేధం తప్పించుకునే వరకు బైట్‌డాన్స్ కు ఇది మరవలేని ఏడాదిగా మిగిలిపోనుంది. ఇప్పటికి వారు పడిన ఇబ్బందులు ఎప్పుడు ముగుస్తాయో తెలీదు.(చదవండి: బ్రెగ్జిట్‌ డీల్‌కు యూకే ఆమోదం

తాజాగా ఓ పన్నెండేళ్ల బాలిక బ్రిటన్‌లో టిక్‌టాక్‌పై కేసు వేసేంది. వ్యక్తిగత గోప్యత విషయంలో ఐరోపా సమాఖ్య నిబంధనలను టిక్‌టాక్‌ ఉల్లంఘించిందని ఆ బాలిక యొక్క ప్రధాన ఆరోపణ. తన వివరాలను గోప్యాంగ ఉంచుతూ కేసు ఫైల్ చేసేందుకు స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. టిక్ టాక్ పై చట్టపరమైన చర్యకు ఇంగ్లాండ్ పిల్లల కమిషనర్ అన్నే లాంగ్ఫీల్డ్ మద్దతు ఇస్తున్నారు. టిక్‌టాక్ యుకే, యూరోపియన్ యూనియన్ డేటా రక్షణ చట్టాలను ఉల్లంఘించిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌లో టిక్‌టాక్‌ను ఉపయోగించే 16 ఏళ్లలోపు వారికి ఈ కేసు మరింత రక్షణ చర్యలు కల్పిస్తుందని ఎంఎస్ లాంగ్‌ఫీల్డ్ భావిస్తోంది. డేటా రక్షణ లోపం కారణంగా తన వ్యక్తిగత సమాచారం బహిర్గతం అయ్యిందని బాలిక తెలిపింది. తన వాదనతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి విచారణకు ఆదేశించింది. పిల్లల డేటా రక్షణకు సంబందించిన కేసులను ఎదుర్కోవడం టిక్‌టాక్ కి ఇది మొదటిసారి కాదు. 2019లో టిక్‌టాక్‌కు US ఫెడరల్ ట్రేడ్ కమిషన్ $ 5.7 మిలియన్ జరిమానా విధించింది.

మరిన్ని వార్తలు