టోక్యో ఒలింపిక్స్‌లో మాధురి దీక్షిత్‌ సాంగ్‌ వైరల్‌

5 Aug, 2021 14:05 IST|Sakshi

జపాన్‌ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇదివరకు లేని రికార్డులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసిన ఈ అంతర్జాతీయ ఆటలకు చెందిన విషయాలే హల్‌చల్‌ చేస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన బోలేడు వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బాలీవుడ్‌కు చెందిన ఓ పాట ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది.

ఒలింపిక్స్‌లో ఇజ్రాయిల్‌ జట్టు స్మిమర్స్‌ ఈడెన్‌ బ్లెచర్‌, షెల్లీ బోబ్రిట్క్సీ.. ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌ డ్యూయెట్‌ ఫ్రీ రొటీన్‌ ప్రిలిమినరీలో మంగళవారం పోటీ పడ్డారు. ఆ సమయంలో బీటౌన్‌ బ్యూటీ మాధురి దీక్షిత్‌ నటించిన పాపులర్‌ సాంగ్‌ ‘ఆజా నాచ్లే’ పాటకు డ్యాన్స్‌ చేస్తూ స్వీమ్‌ చేశారు. అన్నే దానం అనే ట్విట్టర్‌ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ‘చాలా ధన్యవాదాలు ఇజ్రాయెల్ టీమ్. ఆజా నాచ్‌లే పాటను వినడానికి, చూడటానికి ఎంత ఉత్సాహంగా ఉందో మీకు తెలియదు’. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఇజ్రాయెల్ స్విమర్స్‌ బాలీవుడ్‌ పాటను ఎంచుకున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్విమ్మింగ్‌లో వారి స్టైల్‌కు ఫిదా అయిపోతున్నారు. ఒలింపిక్స్‌లో బాలీవుడ్‌ సాంగ్‌ వినిపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  కాగా మాధురి దీక్షిత్, కొంకణ సేన్, కునాల్ కపూర్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆజా నాచ్లే . 2007లో విడుదలైన ఈ చిత్రానికి అనిల్ మెహతా దర్శకత్వం వహించారు.

మరిన్ని వార్తలు