Tomb With Warning Text In Israel: ఆ సమాధి పై ఎరుపు రంగుతో రాసిన హెచ్చరిక... తెరిచారో అంతే...

14 Jun, 2022 16:53 IST|Sakshi

ఈజిప్ట్‌, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ వంటి దేశాల్లో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు జరిపి పరిశోధనలు చేస్తుంటారు. మమ్మీలుగా పిలిచే పురాతన సమాధులను తెరిచి నాటి పూర్వీకులు ఎలా ఉండేవారు, ఎలా చనిపోయారు, ఏం ఉపయోగించేవారు వంటి విషయాలను వెల్లడించేవారు. అంతేకాదు ఆ సమాధి ఎన్నాళ్ల క్రితం నాటిది కూడా లెక్కగట్టి చెబుతారు. ఇలాంటి ఆసక్తకరమైన విషయాలు వెలికితీసే క్రమంలో ఇక్కడొక దేశంలో కనుగొన్న సమాధి చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ సమాధిపై ఉండే హెచ్చరిక చూస్తే కచ్చితంగా వామ్మో! అనిపిస్తుంది.

వివరాల్లోకెళ్తే...ఇజ్రాయెల్‌లో గలీలీలోని యూదుల బీట్‌ షీయారిమ్‌ శ్మశానవాటికలో ఒక పురాతన సమాధిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 65 ఏళ్ల క్రితం యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కనుగొన్న తొలి సమాధి ఇదేనని శాస్తవేత్తల అభిప్రాయం. ఆ సమాధిపై ఎరుపు రంగుతో ఒక హెచ్చరిక హిబ్రూ లిపిలో ఉంది. ఈ సమాధి తెరిచే సాహసం చేస్తే శపించబడతారనేరది ఆ హెచ్చరిక సారాంశం.

ఈ సమాధి 18 వేల ఏ‍ళ్ల నాటిదని అన్నారు. మతం మార్చుకున్న జాకబ్‌ అనే యూదు వ్యక్తిదని చెబుతున్నారు. పైగా ఆ హెచ్చరికలో మీరు తెరవకూడాని వస్తువులు అంటూ వాటి వివరాలు కూడా ఉన్నాయి. ఈ సమాధిపై ఉన్న శాసనం చివరి రోపమన్‌ లేదా బైజాంటైన్ కాలానికి చెందినదని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇజ్రాయెల్ అంటే గతం, వర్తమానం, భవిష్యత్తుల సమాహారం అని ఒకరు, తెరవకూడని విషయాలు యూదులకు సరిహద్దులు అంటూ మరోకరు రకరకాలగా కామెంట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: పాపం పెద్దాయన.. అది నేరమా? మండిపడుతున్న నెటిజన్లు)

మరిన్ని వార్తలు