Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10

24 Apr, 2022 17:03 IST|Sakshi

ఉక్రెయిన్‌ సహాయార్థం..బేస్‌బాల్‌ వేలం
జెలెన్‌స్కీ సంతకం చేసిన మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌(ఎంఎల్‌బీ) ఉక్రెయిన్‌ సహాయర్థం వేలాని సిద్ధమవుతోంది. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ బేస్‌బాల్‌పై సంతకం చేశాడు.

ఆర్టికల్‌ రద్దు తర్వాత కశ్మీర్​లో మోదీ పర్యటన.. కామెంట్స్‌ ఇవే..
జమ్ముకశ్మీర్​లో 370వ అధికరణ రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. 

గడీల రాజ్యం పోయి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి:  బండి సంజయ్
సీఎం కేసీఆర్ పెద్ద మోసకారి.. కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖర్ రావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆయన  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 11వ  రోజు నారాయణపేటలో పర్యటించారు. 

ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతులకు బిగ్‌ షాక్‌
మాజీ నటి, అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌, ఆమె భర్త రవి రానాలకు బిగ్‌ షాక్‌ తగిలింది. వీరిద‍్దరికీ మే 6 వ‌ర‌కూ జుడీషియ‌ల్ రిమాండ్ విధిస్తున్న‌ట్లు బాంద్రా మెట్రో పాలిట‌న్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ స‌న్‌డే కోర్టు ఆదేశాలిచ్చింది.

కాపు ఓట్ల కోసం చంద్రబాబు.. పవన్‌ను గాలంగా వేశారు: అంబటి
కాపు వర్గం ఓట్ల కోసం చంద్రబాబు.. పవన్‌ కళ్యాణ్‌ను గాలంగా వేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు మృతి చెందాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బైక్‌ ఎన్‌ఓసీ విషయంలో బాలిజీ మోటర్స్‌ షోరూం యజమానితో ఈ నెల 10న  ప్రశాంత్‌, శ్రావన్‌ అనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు.

ఆ హార్రర్‌ మూవీతో బాలీవుడ్‌కు అవికా గోర్‌ ఎంట్రీ..
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది  నార్త్‌ బ్యూటీ అవికా గోర్. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్‌ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది.

టీమిండియాలో చోటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్ధిక్‌ పాండ్యా
 ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ పగ్గాలు చేపట్టాక హార్ధిక్‌ పాండ్యా ఫేట్‌ ఒక్కసారిగా మారిపోయింది. కాగా, టీమిండియాలో చోటుకు సంబంధించి హార్దిక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అగ్ని ప్రమాదాల కలకలం...ఓలా ఎలక్ట్రిక్‌ కీలక నిర్ణయం..!
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పలు కంపెనీల స్కూటర్లు అగ్రి ప్రమాదాలకు గురికావడంతో ఆయా కంపెనీలు సదరు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను వెనక్కి పిలిచేందుకు సిద్ధమయ్యాయి.

Mystery: లాసన్‌ ఫ్యామిలీ ట్రాజెడీ..
అత్యంత క్రూరమైన జంతువు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కొందరు మనుషుల క్రూరమైన ఆలోచనల నుంచి తప్పించుకోవడం అసాధ్యం.  ఎందుకంటే, అనుకున్నది జరిగేంత వరకూ.. వాళ్లు పన్నే వ్యూహాలు.. వేసే ఎత్తుగడలు.. ఎవరి ఊహలకూ అందవు. ఎలాంటి అనుమానాలకూ తావివ్వవు.

మరిన్ని వార్తలు