Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

13 Apr, 2022 10:00 IST|Sakshi

యుద్ధం కొనసాగుతుంది.. స్పష్టం చేసిన పుతిన్‌
పాశ్చాత్య దేశాల ఆంక్షల దాడిని రష్యా విజయవంతంగా తట్టుకుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఆంక్షలు అంతిమంగా వాటికే బెడిసికొడతాయన్నారు.

ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు: యూజీసీ అనుమతి
ఇకపై విద్యార్థులు ఒకేసారి రెండు ఫుల్‌టైమ్‌ డిగ్రీ కోర్సులు చేసేందుకు యూజీసీ అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి త్వరలో నిబంధనలు జారీ చేస్తామని, ఈ అవకాశం 2022–23 విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ చెప్పారు.

చెప్పాడంటే.. చేస్తాడంతే..
సంగం బ్యారేజీ.. జిల్లా రైతాంగానికి వరప్రసాదిని. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తన హయాంలో రైతాంగానికి అంకితం చేసేందుకు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తపించారు. ఆ కల నెరవేరకుండానే దూరమయ్యారు.

ప్రాణహిత పుష్కర సంబరం
 ప్రాణహిత పుష్కరాలకు నదీతీరం, త్రివేణి సంగమం సంసిద్ధమైంది. నదులకు 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నదికి బుధవారం నుంచి పుష్కరాలు నిర్వహిస్తున్నారు.

మన పతకాలకు మళ్లీ ఎసరు.. భారత్‌ ‘గురి’పెట్టలేదు.. ‘పట్టు’ పట్టలేదు!
ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ) మన పతకావకాశాలకు మళ్లీ ఎసరు పెట్టింది. విక్టోరియా (ఆస్ట్రేలియా) రాష్ట్రంలో జరిగే తదుపరి మెగా ఈవెంట్‌లోనూ భారత్‌ ‘గురి’పెట్టలేదు. ‘పట్టు’ పట్టలేదు. కొత్తగా బహుళ వేదికల్లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా షూటింగ్, ఆర్చరీ క్రీడాంశాలతో పాటు రెజ్లింగ్‌ను పక్కన పెట్టేశారు.

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..
తమిళ స్టార్‌ విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్‌’. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 13)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

17 నెలల గరిష్టం...ధరల షాక్...!
భారత్‌ ఎకానమీ ఇంకా సవాళ్ల దశ నుంచి తేరుకోలేదని తాజా ఆర్థిక గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో  17 నెలల గరిష్ట స్థాయిలో 6.95 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది.

జీవితానికి  రంగులద్దింది!
జీవితాన్ని ప్రారంభించేటప్పుడు తెలియదు ఆ జీవితం ఎన్ని మలుపులు తీసుకుంటుందో. మన ఆకాంక్షలు కొన్ని, అవకాశాలు కొన్ని, అభిరుచులు మరికొన్ని. వీటన్నింటినీ కలబోసుకుని జీవితాన్ని డిజైన్‌ చేసుకోవాలని ఉండడం ఏ మాత్రం తప్పులేదు.

సైబర్‌ నేరస్తుల సెక్స్‌టార్షన్‌
ప్రభుత్వ విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి కొడుకు బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఓ రోజు రాత్రి 10 గంటలకు ఫేస్‌బుక్‌లోని మెసెంజర్‌ ద్వారా వీడియో కాల్‌ వచ్చింది. ఆన్‌లైన్‌లోనే ఉన్న ఆ విద్యార్థి ఆన్సర్‌ చేశాడు. ఎదురుగా ఓ అమ్మాయి న్యూడ్‌ పొజిషనల్‌లో ఉండి మాట్లాడింది.

వింత రంధ్రం.. మనుషుల తంత్రం!
ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. డ్యామ్‌లో ఏదో పెద్ద రంధ్రం ఏర్పడి నీళ్లు లోపలికి వెళ్లిపోతున్నాయని అనిపిస్తోంది కదా. కానీ ఇది మనుషులు ఏర్పాటు చేసిన రంధ్రమే. ఆశ్చర్యంగా ఉంది కదా..! అసలీ రంధ్రం ఎక్కడ ఉంది.. ఎందుకు ఏర్పాటు చేశారు.. దీని లాభనష్టాలేంటి.. తెలుసుకుందాం.

మరిన్ని వార్తలు