Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

14 Apr, 2022 09:57 IST|Sakshi

ఆహారం ‘వృథా’లో టాప్‌ టెన్‌ దేశాలివే..
భూమ్మీద మనుషులందరికీ సరిపోయేంత ఆహారం ఉత్పత్తి అవుతున్నా అందరికీ అందని దుస్థితి. ఓ వైపు రెండు పూటలా తిండి దొరకనివారు కోట్లాది మంది ఉంటే.. మరోవైపు మరోవైపు కోట్ల మందికి సరిపడా ఫుడ్‌ వృథా అవుతున్న పరిస్థితి.

యూపీ సీఎం యోగి కీలక ఆదేశాలు..
అధికార పర్యటనల్లో హోటళ్లలో బస చేయకుండా ప్రభుత్వ గెస్ట్‌హౌసుల్లోనే ఉండాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ తన మంత్రులను ఆదేశించారు. అదేవిధంగా బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దన్నారు.

అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం
ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పలురకాల పోస్టుల భర్తీలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. నిర్దేశించిన పోస్టులకు ఇప్పటివరకు ఇంటర్వ్యూలతో కలిపి అర్హతల నిర్ధారణ జరిగేది.

బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్‌
ఐపీఎల్‌లో గత సీజన్‌ వరకు తన విధ్వంసక ఆటతో అభిమానులను అలరించిన ఏబీ డివిలియర్స్‌ ఈ సారి నుంచి దూరమయ్యాడు. అయితే అతడిని గుర్తు చేసేలా 18 ఏళ్ల దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ మెరుపు ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు.

https://www.sakshi.com/telugu-news/sports/dewald-brevis-aka-baby-ab-destroys-rahul-chahar-mi-vs-pbks-clash-ipl-2022-1448699

‘కేజీయఫ్‌ 2’ టాక్‌ ఎలా ఉందంటే..
‘కేజీఎఫ్ చాపర్ట్ 2’ కోసం యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఈ మూవీ మొదటి పార్ట్‌ ‘కేజీఎఫ్‌’ భారీ విజయం సాధించడమే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం.. భారతీయ బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టించింది.

కార్వీ కేసులో ‘షాక్‌’ ఎక్స్చేంజీలు
కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) కేసులో సంచలనం. స్టాక్‌ ఎక్స్చేంజీలకు షాక్‌ తగిలేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) కీలక నిర్ణయం తీసుకుంది.

తల్లిదండ్రులే ఆమె పిల్లలు
పిల్లలు విడిచిన తల్లిదండ్రులు మాత్రం రాజేశ్వరిని వెతుక్కుంటూ వెళతారు. ఆమె నడుపుతున్న హోమ్‌ వారికి శాశ్వత ఇల్లుగా మారింది. ఊరూరా ఎంతమంది రాజేశ్వరుల అవసరం ఉందో కదా ఇప్పుడు.

బాలికపై స్నేహితుడు లైంగికదాడి.. అది చూసి మరో ముగ్గురు..
మైనర్‌ బాలికపై ఆమె స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చూసిన మరో ముగ్గురు యువకులు వారిద్దరిని బెదిరించి ఆ మైనర్‌ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు.

లంక ప్రధానితో చర్చలకు నో!
శ్రీలంక అధ్యక్షుడి భవనం ముందు నిరసనలు కొనసాగిస్తున్న ఆందోళనకారులను ఆ దేశ ప్రధాని మహింద రాజపక్సే చర్చలకు ఆహ్వానించారు. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలని, ఇతర రాజపక్సే కుటుంబ సభ్యులు అధికారం నుంచి వైదొలగాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు