Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

20 Apr, 2022 10:00 IST|Sakshi

భారత్‌కు బ్రిటన్‌ ప్రధాని.. అహ్మదాబాదే ఎందుకు ?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న వేళ...  బ్యాంకులను వేల కోట్లకు మోసగించిన విజయ్‌ మాల్యా వంటివారు బ్రిటన్లో తలదాచుకున్న నేపథ్యంలో... బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తొలిసారిగా భారత్‌ పర్యటనకు వస్తుండటం ఆసక్తి రేపుతోంది.

లీటర్‌ పెట్రోల్‌ రూ.338.. బస్సు ఛార్జీలు ఏకంగా 35 శాతం పెంపు..
అన్నిరకాలుగా సంక్షోభం కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌ మంగళవారం ఏకంగా 84 రూపాయలు పెరిగి రూ.338కి చేరింది. పెట్రో ధరలు పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి. బస్సు చార్జీలు కూడా ఏకంగా 35 శాతం పెరిగాయి. దీంతో జనం మండిపడుతున్నారు.

సహజీవనాలతో పెరుగుతున్న లైంగిక నేరాలు
సమాజంలో సహజీవనాల(లివ్‌ఇన్‌)తో లైంగిక నేరాలు, స్వైరత్వం పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్‌ హైకోర్టు అభిప్రాయపడింది. ఒక యువతిపై అత్యాచారం చేసాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 25ఏళ్ల యువకుడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్‌ సుబోధ్‌ అభయంకర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

మేల్కొని.. కలగంటున్న రామోజీ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీలంకలా తయారవుతోందని కొద్దిరోజులుగా ‘ఈనాడు’ రకరకాల కథనాలు వండి వారుస్తూనే ఉంది. తనకు మద్దతు పలికేవారు... తెలుగుదేశం సానుభూతి పరులు... వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వ్యతిరేకుల చేత వ్యాసాలు రాయిస్తోంది.

బలోపేతం దిశగా వైఎస్సార్‌సీపీ అడుగులు
రాష్ట్రంలో పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరాల మేరకు ఏర్పాటైన 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు..ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌..!
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న యూఎస్‌ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్‌ తెలంగాణలో భారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. 200 ఎకరాల్లో ఈ కేంద్రం రానుంది. తొలి దశ వచ్చే ఏడాది, రెండవ దశ 2024 నాటికి పూర్తి కానుంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల యూనిట్లు.

అపసవ్యంగా కేంద్రం.. అండగా రాష్ట్రం
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న దేశంలో ఆ రంగాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్రం దాన్ని కుదేలు చేసే తిరోగమన విధానాలు అవలంబిస్తోందని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రైతాంగాన్ని నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని తగ్గించే అపసవ్య విధానాలను అమలు చేస్తుండటం బాధాకరమన్నారు.

Tatineni Rama Rao: దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత
తెలుగు, హిందీ సినిమాల సీనియర్‌ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు.

ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? గొంతు కోసే పరిస్థితి ఎందుకు?
కొన్ని పద్ధతులు మారాలేమో. నిశ్చయ తాంబూలాల సమయంలో పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?’ అని అడగాలేమో. వధువు, వరుడికి అక్కడ ఒక ఆప్షన్‌ దొరుకుతుంది. శుభలేఖలు వేసే ముందైనా ‘ఈ పెళ్లి నిజంగానే నీకు ఇష్టం కదా’ అని మళ్లీ తప్పక అడగాలి. ఏమంటే పిల్లల మనసులు పెద్దలు ఊహించినట్టుగా లేవు.

IPL 2022: సెంచరీ మిస్‌.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు!
కొత్త కెప్టెన్‌ నేతృత్వంలో ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ (ఆర్‌సీబీ) ఆట ప్రతీ మ్యాచ్‌కూ పదునెక్కుతోంది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్‌సీబీ ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది.

మరిన్ని వార్తలు