Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

30 Apr, 2022 17:00 IST|Sakshi

1. రష్యాని ఠారెత్తిచ్చిన ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌ మృతి
ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే 29 ఏళ్ల స్టెపాన్ తారాబల్కా అనే ఉక్రెనియన్‌ ఫైటర్‌ పైలెట్‌ గత నెలలో జరిగిన యుద్ధంలో మరణించాడని వైమానికదళ అధికారులు వెల్లడించారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Patiala Clashes: పంజాబ్‌లో టెన్షన్‌.. టెన‍్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌
పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాటియాలలో శివసేన కార్యకర్తలకు, ఖలిస్థాన్‌ మద్దతుదారులకు మధ్య శుక్రవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాళీ మాత ఆలయం వెలుపల ఇరువర్గాల సభ్యులు కత్తులు ఊపుతూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. CJs-CMs conference: కొనసాగుతున్న సీఎం-న్యాయమూర్తుల సదస్సు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సు కొనసాగుతోంది. శనివారం ఉదయం విజ్ఞాన్‌ భనవ్‌లో మొదలైన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజ్జూ కూడా హాజరయ్యారు.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. నాగుపాముతోనే నాగిని డ్యాన్స్‌.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు
బారాత్‌ అనే పేరు వింటే చాలూ.. పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు కొందరు. చుక్కపడిందంటే చాలూ.. సోయి మరిచి చిందులేస్తుంటారు మరికొందరు. అందునా నాగిని డ్యాన్స్‌ను ఉన్న క్రేజే వేరు. కానీ, ఇక్కడ నాగిని డ్యాన్స్‌ చేసి కటకటాల పాలయ్యారు. అయ్యో.. అంతమాత్రానికేనా అనుకోకండి
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఓయూలో రాహుల్‌ గాంధీ సభకు నో పర్మిషన్‌!
కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ సభకు అనుమతి నిరాకరించింది ఉస్మానియా యూనివర్సిటీ. రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు !
మొన్నటిదాకా ఆర్ఆర్​ఆర్​, నిన్నటిదాకా నేడు కేజీఎఫ్​ 2 సినిమాలు బాక్సాఫీస్​ వద్ద రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఈ శుక్రవారం (ఏప్రిల్​ 29) కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి, రామ్​ చరణ్​ నటించిన ఆచార్య విడుదలైంది. 
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆగ్రహం
ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు సందర్భంగా తెలంగాణ చీఫ్‌ సెక్రటరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Vitamin B12: విటమిన్‌ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే..
శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్‌ బి12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్‌.  రక్తహీనత నుంచి మతిమరుపు వరకు.. నరాల బలహీనత నుంచి డిప్రెషన్‌ వరకు ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. Rohit Sharma: సాహో రోహిత్‌.. ఆ రికార్డు ఇప్పటికీ ‘హిట్‌మ్యాన్‌’ పేరిటే!
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్‌ 30). అతడు ఈరోజు 35వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. లాభాల్లో విప్రో రికార్డు.. ఈసారి ఫ్రెషర్లకు భారీ ఛాన్స్‌
గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 3,093 కోట్లకు చేరింది.
👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు