Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

10 May, 2022 10:00 IST|Sakshi

1. Cyclone Asani: తీరంలో ‘అసని’ అలజడి
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న ‘అసని’ తీవ్ర తుపాను గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖకు ఆగ్నేయంగా 390 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ., పూరీకి దక్షిణ దిశగా 580 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మేలు జరిగిన వారు రుణం తీర్చుకోండి.. సోనియా కీలక వ్యాఖ‍్యలు
త్వరలో జరగనున్న చింతన్‌ శిబిర్‌ తప్పనిసరి తంతుగా మారటానికి వీల్లేదని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల సవాళ్లను, సైద్ధాంతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పార్టీ తిరిగి జవసత్వాలు కూడదీసుకోవాలి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే
పొరుగుదేశం ఉక్రెయిన్‌పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Andhra Pradesh: సర్కారు ఆస్పత్రుల్లో నిరంతర వైద్యం 
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఏమాత్రం తావులేదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఇప్పుడు అలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు
పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్‌ దాడి జరి గింది. మొహాలీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కార్యాలయం మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్‌–ప్రొపెల్డ్‌ గ్రెనేడ్‌(ఆర్‌పీజీ) విసిరినట్లు వెల్లడించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Telangana VRAs Pay Scale Issue: పది పాసైతేనే పేస్కేల్‌!
గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పేస్కేల్‌ అంశాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీఆర్‌ఏల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వీఆర్‌ఏలకు పేస్కేల్‌ ఇవ్వాలని, మిగతా వారందరికీ గౌరవ వేతనంతోనే సరిపెట్టాలనే ప్రతిపాదన సిద్ధమైందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఎవరి కెరీర్‌ను ఎవరూ డిసైడ్‌ చేయలేరు
హిట్‌ వచ్చినప్పుడు ఎగరకూడదు. ఫ్లాప్‌ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. మా నాన్నగారి(ఈవీవీ సత్యనారాయణ) ఫ్రెండ్‌ అని, తెలిసినవారనీ.. ఆబ్లిగేషన్స్‌తో కొన్ని సినిమాలు చేశాను. వరుస ఫ్లాప్స్‌ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే... ఆబ్లిగేషన్స్‌ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని ఫిక్సయ్యాను’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. కోల్‌కథ...ఇంకా ఉంది!
తొలి పది మ్యాచ్‌లలో తీసింది 5 వికెట్లే... ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈసారి తన సత్తా చూపించాడు. 9 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ముంబైకి మంచి విజయావకాశం సృష్టించాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. డెలివరీ గర్ల్స్‌
ఫుడ్‌ యాప్‌లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్‌ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్‌ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్‌ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఒకటికాగా, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు