Top 10 Telugu News: టాప్‌ 10 తెలుగు ట్రెండింగ్‌ న్యూస్‌.. ఒక్క క్లిక్‌తో

15 May, 2022 09:52 IST|Sakshi

1. Andrew Symonds: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. ఆసిస్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతి
ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ  కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. గోధుమల ఎగుమతులపై నిషేధం
దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఏకంగా 14–20శాతం వరకు పెరగడంతో ధరల్ని నియంత్రించడానికి ఎగుమతుల్ని నిలిపివేసింది.
► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. Andrew Symonds-ICC: సైమండ్స్‌కు ఐసీసీ నివాళి.. పాకిస్తాన్‌పై 143 నాటౌట్‌ వీడియో ట్వీట్‌
ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (46) హఠాన్మరణం యావత్‌ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం రాత్రి ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే
భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్‌ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సహజ సేద్యం.. ఏపీ ఆదర్శం
సహజ సేద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. తద్వారా పంటల సాగుకు రైతులకు పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతోంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం కూడా తగ్గడంతో పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తోంది.
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Retiring Rooms: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
మీరు గంటల తరబడి ప్రయాణం చేసి అలసిపోయారా? ఓ రెండు గంటల పాటు విశ్రాంతి కోసం ఎదురుచూస్తున్నారా? మరేం ఫరవాలేదు. రైల్వేస్టేషన్లలోనే ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు. రెండు గంటలే కాదు. రెండు రోజులు కూడా  ఉండిపోవచ్చు.
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Sarkaru Vaari Paata : ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన తాజా చిత్రం​ 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది.
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. 20 నగరాలు.. 50 వేల రెస్టారెంట్లు
ఫుడ్‌ డెలివరీ వేదిక స్విగ్గీ తాజాగా రెస్టారెంట్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌ డైన్‌ఔట్‌ను కొనుగోలు చేస్తోంది. టైమ్స్‌ గ్రూప్‌ కంపెనీ అయిన ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ టైమ్స్‌ ఇంటర్నెట్‌తో ఈ మేరకు స్విగ్గీ ఒప్పందం చేసుకుంది. 
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. అమూల్య ప్రతిభ
నల్లమల అడవుల్లో ఓ కుగ్రామం దోమలపెంట. ఆ ఊరిలో పుట్టిన అమ్మాయి ఇమ్మడి అమూల్య. యూఎస్‌లో అడుగుపెట్టబోతోంది... విద్యార్థిగా కాదు! యంగ్‌ ఉమెన్‌ లీడర్‌షిప్‌ ప్రతినిధిగా...!! యూఎస్‌ కాన్సులేట్‌ ఎంపికలో విజేతగా!!
 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

>
మరిన్ని వార్తలు