తప్పతాగి మహిళ గదిలో నగ్నంగా.. ప్రముఖ కంపెనీ అధికారి నిర్వాకం వెలుగులోకి!

8 Nov, 2022 12:56 IST|Sakshi

ఆయనో ప్రముఖ కంపెనీకి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌. తాగుడు అలవాటుకు బానిసయ్యాడు. ఆ మత్తులో తప్పతాగి పరాయి వాళ్ల ఇంట్లో నిద్రపోయాడు. అదీ నగ్నంగా!. ఆ ఇంటి ఓనర్‌ తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. తీరా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌ అయ్యారు పోలీసులు.  

అమెరికాలోని ఫాయెట్‌విల్లే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...‘‘ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళ నుంచి ఒక అపరిచిత వ్యక్తి మా ఇంట్లో నిద్రపోతున్నాడంటూ  కాల్‌ వచ్చింది. దీంతో మేము హుటాహుటినా ఆమె ఇం​టికి వెళ్లాం. ఆ వ్యక్తి ఆ మహిళ బెడ్‌ మీద నిద్రిస్తూ కనిపించాడు. అతని బట్టలన్నీ నేలపై పడి ఉన్నాయి. మేము బలవంతంగా పైకి లేపి కూర్చొబెట్టినప్పటికీ నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నాడు. మేము ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నా అతను మాట్లాడే స్థితిలో లేడు’’ అని పోలీసులు తెలిపారు. విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి పోలీసులు షాక్‌ తిన్నారు. 

అమెరికాలోని ప్రముఖ మాంసం ప్రాసెసింగ్‌ చేసే టైసన్‌ ఫుడ్స్‌ కంపెనీ వ్యవస్థాపకుడి మనవడు జాన్‌ ఆర్‌ టైసన్‌గా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారాయన. ఈ వ్యవహారంతో జాన్‌ను.. అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తాత పేరుప్రఖ్యాతలు, పరువు పొగొట్టిన మనవడిగా ఇప్పుడతనిపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఐతే ఈ విషయమే కంపెనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఇది ఆయన వ్యక్తిగత విషయం అని చెప్పింది. ఐతే సదరు ఆఫీసర్‌ మాత్రం తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, కంపెనీ విలువలను, తన వ్యక్తిగత విలువలను దిగజార్చాను అంటూ క్షమాపణలు చెప్పాడు జాన్‌ టైసన్‌. ప్రసుతం తాను డ్రింకింగ్‌ అడిక్షన్‌ నుంచి బయటపడటానికి కౌన్సిలింగ్‌ తీసుకుంటున్నానని చెప్పారు.

(చదవండి: కాంట్రవర్సీ: తాగుబోతు స్టాంప్‌ కోసం పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే చాలట!)

మరిన్ని వార్తలు