Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

12 May, 2022 18:00 IST|Sakshi

1. సీఎం జగన్‌ అధ‍్యక్షతన కేబినెట్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్‌ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో అసని తుఫాన్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. సర్కారు వారి పాట.. ప్రేక్షకుల రివ్యూ

సుమారు రెండున్నరేళ్ల తర్వాత టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. ప్రత్యేకించి ఫ్యాన్స్‌ హడావుడి అంతా ఇంతా కాదు. మరి ప్రేక్షకులకు సర్కారు వారి పాట నచ్చిందా? సినిమాపై వాళ్ల అభిప్రాయం ఏంటి?..
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. ఎంగేజ్‌మెంట్‌ కథనాలపై స్పందించిన సోనాక్షి

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు షేర్‌ చేస్తూ తన వేలికి ఉన్న డైమండ్‌ రింగ్‌ హైలెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలకు ‘ఇది నాకు బిగ్‌ డే.. అంటూ చేసిన క్యాప్షన్‌పైనా స్పందించింది.
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. నాటో కోసం ఫిన్‌ల్యాండ్‌ దరఖాస్తు

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూరప్‌ కంట్రీ ఫిన్‌ల్యాండ్‌ నాటో దళంలో చేరేందుకు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. 
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. దేశం విడిచి పోరాదు

శ్రీ లంక మాజీ ప్రధాని మహింద రాజపక్సకు భారీ షాక్‌ తగిలింది. ఆందోళనకారులకు భయపడి.. ఆయన తన కుటుంబం, అనుచరగణంతో భద్రంగా తలదాచుకున్న విషయం తెలిసిందే. కాస్త అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ముంబై వర్సస్‌ సీఎస్‌కే.. నిలవాలంటే గెలవాలి!
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే​ ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ (మే 12) ముంబై ఇండియన్స్‌తో జరిగే కీలక పోరులో తప్పక గెలవాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా, ఓడినా ఒరిగేదేమీ లేకపోగా, సీఎస్‌కే ఓడితే మాత్రం ప్యాకప్‌ చెప్పాల్సి ఉంటుంది.
►  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. ఓలాకు భారీ షాక్‌
ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తయారీ సంస్థ ఓలాకు భారీ షాక్‌ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆ సంస్థకు సీటీవో దినేష్‌ రాధా కృష్ణ గుడ్‌ బై చెప్పగా..తాజాగా వ్యక్తిగత కారణాల వల్ల ఓలాకు రాజీనామా చేస్తున్నట్లు సీఎంఓ వరుణ్‌ దుబ్‌ ప్రకటించారు. 
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల

పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో.. 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.  ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. తాజ్‌ మహల్‌ గదుల పిటిషన్‌ తిరస్కరణ

తాజ్‌ మహల్‌లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్‌) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్‌ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్‌ వ్యాఖ్యానించింది.
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10.నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్‌

విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిదేహానికి కేజీహెచ్‌లో గురువారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. 
► పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు