Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

18 May, 2022 17:03 IST|Sakshi

1. ఆన్‌లైన్‌ గేమ్స్‌పై కేంద్రం జీఎస్‌టీ వసూలు

ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో,రేస్‌ కోర్స్‌లపై జీఎస్టీ బాదుడుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ కంటే అది ఎక్కువే అని తెలుస్తోంది. అది ఏ మేర అంటే..
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. ఇది ఓ అమ్మ విజయం, పెరారివాలన్‌ భావోద్వేగం

రాజీవ్ గాంధీ హత్య కేసులోని ఏడుగురు దోషుల్లో ఒకరు,  యావజ్జీవ ఖైదీ.. ఏజీ పెరారివాలన్‌ అలియాస్‌ అరివును విడుదల చేయాలని సుప్రీం మే 18న ఆదేశించింది. 19 ఏళ్ల వయసులో  అరెస్టయ్యి, గత  మూడు దశాబ్దాలుగా  జైల్లో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల వయసులో పెరారివాలన్‌ కు ఎట్టకేలకు విముక్తి లభించింది.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. కోనసీమ జిల్లా పేరు మార్పు

ఆంధ్రప‍్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లాను పేరును డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. టిట్‌ ఫర్‌ టాట్‌: పుతిన్‌పై బ్యాన్‌ విధించిన కెనడా

ఉత్తర అమెరికా దేశం కెనడా ఊహించని నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై నిషేధం విధించింది. పుతిన్‌తో పాటు మరో వెయ్యి మంది రష్యన్‌ జాతీయలు మీద(రాజకీయ నేతలు, ప్రముఖులు, అధికారులు ఉన్నారు) కూడా బ్యాన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది.
 పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఎఫ్‌ 3’ మూవీ టికెట్‌ రేట్స్‌ పెంపుపై దిల్‌ రాజు క్లారిటీ

ఎఫ్‌ 3 మూవీ టికెట్‌ ధరల పెంపుపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల స్టార్‌ హీరోల సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచిన విషయం విధితమే. దీంతో తాజాగా ఎఫ్‌ 3కి కూడా టికెట్‌ ధరలు పెంచుతారా? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్‌ రేట్స్‌ పెంపుపై క్లారిటీ ఇచ్చాడు మూవీ నిర్మాత దిల్‌ రాజు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. అడవిలో మంట.. పాక్‌ టిక్‌టాక్‌ స్టార్‌పై ఆగ్రహం

పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా స్టార్‌ హ్యుమైరా అస్గర్‌ షేర్‌ చేసిన టిక్‌టాక్‌ వీడియోపై యావత్‌ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందరూ ఫైర్‌ అయ్యేంతలా ఆమె ఏం చేసిందంటారా? హ్యుమైరా తగలబడుతున్న చెట్ల ముందు అందంగా తయారై సుకుమారంగా నడుచుకుంటూ వెళ్లింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7.కేకేఆర్‌ కమలేశ్‌ జైన్‌కు బంపరాఫర్‌

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రధాన సిబ్బందిలో ఒకరైన కమలేశ్‌ జైన్‌ బంపరాఫర్‌ కొట్టేశారు. టీమిండియా హెడ్‌ ఫిజియోగా ఆయన ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బీసీసీఐ కార్యదర్శి, ఎన్‌సీఏ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌లను ఆయన మెప్పించినట్లు సమాచారం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8.2007 మక్కా మసీదు పేలుళ్లకు పదిహేనేండ్లు పూర్తి

వేసవి ఉక్కపోతతో ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.  మక్కా మసీదులో పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఐదు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నగరంపై మాసిపోని ఈ మరకకు నేటికి పదిహేను ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. ఆనాటి నుంచి జరిగిన పరిణామాలు చూద్దాం. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. తీరిన బొగ్గు కొరత.. ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్‌ సరఫరా

ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10.అది కుతుబ్‌మినార్‌ కాదు.. సూర్య గోపురం!!

తాజ్‌మహల్‌ కాదు తేజో మహల్‌ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్‌ మినార్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్‌ అధికారి. అది కుతుబ్‌ మినార్‌ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు