Tornadoes in America: విలయ విధ్వంసం.. 94కు చేరిన మరణాలు, వైరలైన దృశ్యాలు

13 Dec, 2021 09:39 IST|Sakshi
కెంటకీలోని బ్రెమెన్‌లో ధ్వంసమైన వాహనాలు, నిర్మాణాలు

అమెరికాలో 94కు చేరిన మరణాలుకొనసాగుతున్న శిథిలాల తొలగింపు.. సహాయక చర్యలు 

వాషింగ్టన్‌/శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని ఆరు రాష్ట్రాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. కెంటకీ, ఇల్లినాయిస్, టెన్నెస్సీ, మిస్సోరి, అర్కాన్సస్, మిస్సిసిపీ రాష్ట్రాల్లో టోర్నడోల ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మృతుల సంఖ్య 94కు చేరింది. కెంటకీలోని మేఫీల్డ్‌ పట్టణంలో కొవ్వొత్తుల ఫ్యాక్టరీ ధ్వంసం కావడంతో 80 మంది మరణించారని గవర్నర్‌ ఆండీ బెషియర్‌ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 


Tornadoes In America

ఇల్లినాయిస్‌ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లేలోని అమెజాన్‌ గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఆరుగురు ఉద్యోగులు, ఆర్కాన్సస్‌లో ఓ నర్సింగ్‌ హోమ్‌ తీవ్రంగా దెబ్బతినడంతో ఇద్దరు, టెన్నెస్సీలో నలుగురు, మిస్సోరీలో ఇద్దరు టోర్నడోల కారణంగా కన్నుమూసినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. 


Powerful Tornadoes Hits America Six States

మేఫీల్డ్‌ పట్టణం పూర్తిగా ధ్వంసమయ్యింది. పైకప్పులు ఎగిరిపోయాయి. ఇళ్లు, కార్యాలయాలు నేలమట్టమయ్యాయి. పట్టణంలో ఎటుచూసినా విధ్వంసమే కళ్ల ముందు కనిపిస్తోంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.  ఆరు రాష్ట్రాల్లో ప్రకృతి విలయం అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద విలయాల్లో ఒకటని అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. ఇక టోర్నడో విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: 
అమెరికాలో టోర్నడో బీభత్సం..
చైనాలో విరుచుకుపడ్డ టోర్నడోలు, 12 మంది మృతి

మరిన్ని వార్తలు