వైరల్‌ : ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు

5 Aug, 2020 11:43 IST|Sakshi

రోమ్‌ : మ్యూజియం అంటేనే పురాత‌న వ‌స్తువులు, శిల్పాలు ఉంటాయి. వీటిని ఏ మాత్రం క‌దిలించినా విర‌గ‌డం ఖాయం. అందుకే ప్ర‌తి శిల్పానికి తాకేందుకు వీలు లేకుండా అద్దాలు అమ‌ర్చి ఉంటాయి. కానీ ఇట‌లీలోని పోసాగ్నోలోని జిప్సోథెకా ఆంటోనియో కనోవా మ్యూజియంలో శిల్పాలను అద్దాల్లో పెట్టకుండా మూములుగానే పెట్టి ప్రదర్శనకు ఉంచారు. మ్యూజియంకు వ‌చ్చే ప‌ర్యాట‌కులు శిల్పాల మీద కూర్చొని మ‌రీ ఫోటోల‌కు ఫోజులు ఇస్తుంటారు. తాజాగా ఆస్ట్రియాకు చెందిన ఒక టూరిస్ట్‌ మ్యూజియంను సందర్శించాడు. దాదాపు 200 ఏండ్ల పురాత‌న‌మైన ఒక శిల్పం మీద కూర్చొని ఆ పర్యాటకుడు ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది.(మాస్క్‌ పెట్టుకోలేదని చితకబాదారు)

ఫోటో దిగిన తర్వాత అతని ప్రవర్తన కొంత వింతగా కనిపించింది. ఏదో జరిగిపోయినట్టు అక్క‌డే నిలబడి అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. మ్యూజియంలో ఉన్నవాళ్లు అన్ని వైపుల‌కు వెళ్లి శిల్పాల‌ను చూస్తుంటే ఆ వ్యక్తి మాత్రం అక్క‌డ‌క్క‌డే తిరుగుతున్నాడు.అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడనేది అక్కడున్నవారికి అర్థం కాకపోయినా.. సీసీ కెమెరాలు పసిగట్టాయి. ఇంతకీ విషయమేంటంటే..  అత‌ను ఫోటో దిగుతున్నప్పుడు చేయి బలంగా తాకడంతో శిల్పం కుడికాలి బొట‌నవేలు విరిగిపోయింది. అది ఎవ‌రికీ క‌నిపించ‌కూడ‌దనే ఉద్దేశంతోనే అక్కడే తిరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'అత‌నికి కొంచెమైనా బుద్దుండాలి.. సున్నితంగా ఉండే శిల్పాల మీద కూర్చొని ఎవరైనా ఫోటోలు దిగుతారా' .. 'శిల్పాల చుట్టూ కనీస భద్రత లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు