టైటానిక్‌ ఓడను చూడాలనుకుంటున్నారా.. టికెట్‌ రూ.కోటి 87 లక్షలే

26 Nov, 2021 11:15 IST|Sakshi

సమ్మర్‌లో టైటానిక్‌ టూర్‌

ఒకప్పుడు అంటే... 1912లో టైటానిక్‌ షిప్‌ ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ ఖరీదు... మూడువేల రూపాయలు. ఇప్పుడు శిధిలావస్థలో సముద్రపు అడుగుభాగంలో ఉన్న అదేషిప్‌ను చూసేందుకు టికెట్‌ ఖరీదు అక్షరాలా కోటి 87లక్షలు.
చదవండి: ‘టైటానిక్‌’ మరో 12 ఏళ్లే.. ఆ తర్వాత..

టైటానిక్‌ సినిమా చూసిన ఎవ్వరికైనా... ఒక్కసారి ఆ ఓడ ఎక్కాలనిపిస్తుంది. ఆసక్తి ఉంటే... మునిగిపోయిన ఆ టైటానిక్‌ షిప్‌నే చూపిస్తామని ఓషన్‌గేట్‌ ఎక్స్‌పెడిషన్‌ సంస్థ చెబుతోంది. 1912లో మునిగిపోయి సముద్రంలో 12,500 అడుగుల లోతుకు వెళ్లిపోయిన ఆ షిప్‌ను చూసేందుకు ఓషన్‌గేట్‌ గతేడాది నుంచి టూర్స్‌ ఏర్పాటు చేస్తోంది. డిస్కవరీ, నేషనల్‌ జాగ్రఫీలను మించిన ఆ అద్భుతమైన అనుభూతి సొంతం చేసుకోవాలనుకుంటే... వేసవిలో మే నుంచి జూన్‌వరకు యాత్రకు వెళ్లొచ్చు. 110 ఏండ్ల కిందట మునిగిన ఈ షిప్‌ను ఇప్పటిదాకా 200 మంది మాత్రమే చూశారు. 
చదవండి: అఫ్గానిస్తాన్‌: ఆకలి చావులు, ఆర్థిక సంక్షోభంతో పొత్తిళ్లలోనే పెళ్లిళ్లు!


ప్రయాణం సాగుతుందిలా... 
ఈ మిషన్‌ కాలం ఎనిమిది రోజులు. కెనడా, న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెంట్‌ జాన్స్‌ నుంచి టైటానిక్‌ శిథిలాలున్న చోటు 600 కిలోమీటర్లు. అక్కడ నుంచి... నాలుగు కిలోమీటర్ల లోతు సబ్‌మెర్సిబుల్‌లో ప్రయాణించి ఆ షిప్‌ను చేరుకుంటారు. షిప్‌ను చేరేందుకు సముద్రంలోపల దాదాపు ఎనిమిది నుంచి పది గంటలపాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒక్కో సబ్‌మెర్సిబుల్‌లో ఐదుగురు ప్రయాణించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా శిథిలమైన ఈ షిప్‌ ఇంకో 40 ఏళ్లలో మొత్తం నామరూపాల్లేకుండా పోవచ్చని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫెరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. 
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

  

మరిన్ని వార్తలు