యంగ్‌ పైలట్‌ మృతి.. చిన్న దోమ ఎంత పనిచేసింది!

7 Jul, 2022 21:08 IST|Sakshi

చిన్న దోమనే కదా అని లైట్‌ తీసుకున్నారో అంతే సంగతి. దోమ కారణంగా ఓ పైలట్‌ మృతి చెందింది. అదేంటి దోమతో ఎలా చనిపోయింది అనుకుంటున్నారా..?. ఈ విషాద ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అయితే, ఏడాది క్రితం సదరు పైలట్‌ మృతిచెందగా నివేదిక తాజాగా బయటకు వచ్చింది. 

వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ట్రెయినీ పైలట్‌ ఓరియానా పెప్పర్ దోమ కాటు కారణంగా కంటిపై చిన్న వాపు కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో, ఆమెకు వైద్యులు యాంటీబయోటిక్స్‌ టీకాలు ఇచ్చి ఇంటికి పంపించారు. కాగా.. రెండు రోజుల తర్వాత ఆమె.. ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోయింది. దీంతో ఆందోళనలకు గురైన కుటుంబ సభ్యులు.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. అనంతరం మృతిచెందింది. కాగా, ఆమె మృతి మిస్టరీ కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తాజాగా నివేదికను వెల్లడించారు. దోమకాటు కారణంగా శరీరంలో తలెత్తిన ఇన్ఫెక్షన్‌ మెదడుకు చేరిన కారణంగా ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా వైద్యులు.. చిన్న వయస్సులో ఆమె ఇలా దోమకాటుతో చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇలా కొద్ది మందికే జరుగుతుందని అన్నారు. 

ఇది కూడా చదవండి: జఫ్పా కేక్‌.. రికార్డులు బ్రేక్‌.. పేరు డిఫరెంట్‌గా ఉన్నా...  టేస్ట్‌ మాత్రం సూపర్‌

మరిన్ని వార్తలు