అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి

27 May, 2021 05:12 IST|Sakshi

సాన్‌జోస్‌ (అమెరికా): కాలిఫోర్నియాలోని సాన్‌జోస్‌లో బుధవారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. సిలికాన్‌ వ్యాలీలో బస్సు, లైట్‌ రైలు సేవలు అందించే వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీకి చెందిన ఉద్యోగి సామ్‌ కాసిడీ ఈ దాడికి తెగబడ్డాడు.

బుధవారం ఉదయం 6.30 గంటలకు కాసిడీ సాన్‌జోస్‌ రైల్వే యార్డులో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు. అతని సహోద్యోగులు సహా మొత్తం 8 మందిని పొట్టనబెట్టుకున్నాడు. కాసిడీ కూడా చనిపోయాడు. అయితే అతనెలా చనిపోయింది తెలియరావట్లేదు.

చదవండి: గాజాకు అండగా మేముంటాం: అమెరికా

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు