చెక్కల కింద డబ్బుల పెట్టే.. రూ.లక్షల్లో..

23 Apr, 2021 16:42 IST|Sakshi
దొరికన డబ్బుతో ట్రెసర్‌ హంటర్‌

వాషింగ్టన్‌ : కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు పరుల పాలు కాకుండా ఉండటం కోసం భూగర్భంలోనే.. ఇంట్లో ఎక్కడో చోట దాచి పెట్టటం అనాదిగా జరుగుతున్నదే. ఒక్కోసారి తన కుటుంబానికి చెందాలన్న ఆశతో వాటిని దాచి పెట్టినా.. కనుక్కునే అవకాశం లేకపోవటంతో.. పదులు, వందల సంవత్సరాల తర్వాత వేరే వారికి దొరకటం జరుగుతూనే ఉంది. సొంత వారికి దొరకటం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. వివరాలు.. మాసాచ్యూసెట్స్‌కు చెందిన ఓ ముసలాయన తను కూడబెట్టుకున్న దాదాపు 35 లక్షల రూపాయల డబ్బును ఓ పెట్టలో పెట్టి, ఇంట్లో ఎక్కడో దాచి పెట్టాడు. కొద్దిరోజుల తర్వాత అతడు చనిపోయాడు. ఇంట్లో ఎక్కడో చోట డబ్బు దాచిపెట్టబడి ఉందని కుటుంబసభ్యులకు తెలిసింది.

అయితే అది ఎక్కడన్నది తెలియలేదు. సంవత్సరాల నుంచి దాన్ని కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ఇంటిని అమ్మాలనుకుంటున్న వారు అందులో నిధి ఉందని తెలిసి ఆగిపోయారు. ఇలా అయితే కుదరదని భావించి నిధుల అన్వేషణలో 10 సంవత్సరాల అనుభవం ఉన్న ట్రెసర్‌ హంటర్‌ కేయిత్‌ విల్లేను రంగంలోకి దింపారు. అతడు మెటల్‌ డిటెక్టర్‌ సహాయంతో ఇళ్లంతా జల్లెడ పట్టాడు. ఇంట్లో ఓ మూల కిటికీల దగ్గర డబ్బుతో నిండిన పెట్టను వెలికి తీశాడు. అందులో దాదాపు 35 లక్షల రూపాయల డబ్బు కట్టలు వెలుగు చూశాయి. దీంతో సదరు కుటుంబం ఆనందంతో ఎగిరి గంతులు వేసింది.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు