మ్యూజియం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ 'అన‌బెల్లె'?

14 Aug, 2020 20:00 IST|Sakshi

చార‌డేసి క‌ళ్లు, నిండైన ముఖం, నున్న‌టి కురులు.. చ‌దువుతుంటే బాగానే ఉన్న‌ప్ప‌టికీ దేని కోసం వ‌ర్ణిస్తున్నామో చెప్తే మాత్రం ఒక్క‌సారిగా అదిరిప‌డ‌టం ఖాయం. అవును, ఈ వ‌ర్ణ‌న అంతా భ‌యంక‌ర‌మైన‌ "అనబెల్లె" బొమ్మ గురించి. చూడ‌టానికి కొంచెం ముద్దుగా ఎంతో భయంగా క‌నిపించే అన‌బెల్లె ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. అన‌బెల్లె సిరీస్‌లో ఆ బొమ్మ మ‌నుషుల‌కు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌కుండా మ్యూజియంలోని అద్ద‌పు గ‌దిలో బందీ చేస్తారు. సినిమాలోని అన‌బెల్లె నిజ జీవితంలోనూ ఉంది. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!)

రెండు పైకి తేలిన క‌ళ్లు, ఎర్ర జుట్టుతో ఉన్న ఓ దెయ్యం బొమ్మ ఆధారంగా అనబెల్లె తెర‌కెక్కింది. 1970లో న‌ర్సింగ్ కాలేజీ విద్యార్థి ఈ బొమ్మ‌ను బ‌హుమ‌తిగా అందుకుంది. కానీ అతీంద్రియ శ‌క్తులు ఉన్న ఆ బొమ్మ వ‌ల్ల ఎన్నో భ‌యంక‌ర ఘ‌ట‌న‌లు వెలుగు చూశాయి. దీంతో దాన్ని ఎలాగోలా అమెరికాలోని క‌నెక్టిక‌ట్‌లో వారెన్స్ ఆక్ల‌ట్ మ్యూజియ‌మ్‌లో ఉంచారు.

అయితే ఇన్నేళ్ల త‌ర్వాత ఆ బొమ్మ‌ మ్యూజియంలో నుంచి బ‌య‌ట‌ప‌డింద‌ని, ఇంత‌కాలం దాన్ని బంధించినందుకు ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దంటూ నెటిజ‌న్లు హ‌డ‌లిపోతున్నారు. ఆ బొమ్మ‌లోని ఆత్మ ఎంత‌మందిని వెంటాడ‌నుందో అని గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. 2020లో ఇంత‌క‌న్నా ఘోరం ఇంకోటి లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం అన‌బెల్లె పారిపోయి వ‌చ్చినా బ‌య‌ట ప‌రిస్థితి చూసి మ‌ళ్లీ మ్యూజియంలోకి ప‌రుగు పెడుతుందంటూ జోకులు పేల్చుతున్నారు. వాస్త‌వానికి అన‌బెల్లె బొమ్మ మ్యూజియంలోనే ఉంది. కానీ కొంద‌రు కావాల‌ని ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేందుకు ఆ బొమ్మ బ‌య‌ట‌కు వ‌చ్చిందంటూ దుష్ప్ర‌చారం చేస్తున్నారు. (చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్‌ బంక్‌)

మరిన్ని వార్తలు