సీఎం ట్వీట్‌పై విమర్శలు: ‘దీపావళికి, హోలీకి తేడా తెలియదా’

5 Nov, 2021 16:28 IST|Sakshi

పాకిస్తాన్‌ సింధ్‌ ప్రాంత ముఖ్యమంత్రిపై ట్రోలింగ్‌

ఇస్లామాబాద్‌: దీపావళి పండుగ నాడు.. హోలీ శుభాకాంక్షలు తెలిపి.. విమర్శల పాలవుతున్నారు పాకిస్తాన్‌ సింధ్‌ ప్రాంత ముఖ్యమంత్రి. ఆ వివరాలు.. నవంబర్‌ 4న ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులు, రాజకీయవేత్తలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీరందరి మధ్యలో పాకిస్తాన్‌ సింధ్‌ ప్రాంత ముఖ్యమంత్రి తెలిపిన శుభాకాంక్షలు నెటిజనుల దృష్టిని ఆకర్షించాయి. 

దీపావళి సందర్భంగా సింధ్‌ ప్రాంత సీఎం మురద్‌ అలీ షా ట్విటర్‌లో తన ఫోటోని షేర్‌ చేశారు. దీని మీద హోలీ శుభాకాంక్షలు అని ప్రింట్‌ చేయించాడు. ఇది చూసిన నెటిజనులు.. మీకు దీపావళి పండగకి, హోలీకి తేడా తెలియదా అంటూ విమర్శించడం ప్రారంభించారు. పొరపాటు గుర్తించి వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. కానీ నెటిజనులు అప్పటికే ఆ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్‌ తీసి.. వైరల్‌ చేశారు. 
(చదవండి: Diwali 2021: ఈ మీమ్స్‌ చూస్తే.. నవ్వాపుకోలేరు!!)

పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ ముర్తాజా సోలంగి సీఎం ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత ‘‘సింధ్‌ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది హిందువులు. ఇక్కడ విషాదకర అంశం ఏంటంటే.. సింధ్‌ సీఎం ఆఫీస్‌లో పని చేసే సిబ్బందికి దీపావళికి, హోలీకి తేడా తెలియదు. ఇది చాలా విచారకరం’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్‌ ఇస్తాడట

మరిన్ని వార్తలు