ట్రంప్‌ వాషింగ్టన్‌‌ వీడేది ఎప్పుడంటే.. 

16 Jan, 2021 10:54 IST|Sakshi

ఫ్లోరిడా పామ్‌ బీచ్‌లో నూతన జీవితాన్ని ప్రారంభించనున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వాషింగ్టన్‌‌ నుంచి వెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం ట్రంప్‌ వాషింగ్టన్‌ నుంచి బయటకు వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ట్రంప్‌, బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరుకాబోవడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వాషింగ్టన్‌ వెలుపల ఉన్న ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ప్రధాన కార్యాలయం జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ వద్ద ట్రంప్‌ వీడ్కోలు కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన అనంతరం.. ఫ్లోరిడా పామ్‌ బీచ్‌లోని తన మార్‌ ఏ లాగో క్లబ్‌లో ట్రంప్‌ నూతన అధ్యాయన్ని ప్రారంభించనున్నారని సమాచారం. ఇక కొంత మంది వైట్‌హౌస్‌ సహాయకులు ట్రంప్‌ కోసం అక్కడ పని చేయనున్నారని తెలిసింది. (చదవండి: అభిశంసన: ట్రంప్‌ కన్నా ముందు ఎవరంటే)

ప్రామణస్వీకారోత్సవానికి ముందే వైట్ హౌస్ సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆతిథ్యం ఇవ్వాలని కొందరు వైట్‌హౌస్ సలహాదారులు రిపబ్లికన్ అధ్యక్షుడిని కోరుతున్నారు. అయితే ట్రంప్ అలా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు లేవని పరిపాలన అధికారి ఒకరు తెలిపారు. ఇక అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రమే. తన పదవీ కాలం ముగియడానికి ముందే ట్రంప్‌ మరి కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని యోచిస్తున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాక స్వీయక్షమాభిక్ష అనే అపూర్వమైన పద్దతిని ఎంచుకోనున్నారని వెల్లడించారు

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు