Trump: మిస్టర్‌ బైడెన్‌.. ముందు అమెరికన్లను కాపాడండి: ట్రంప్‌ ఫైర్‌

28 May, 2022 11:09 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. హంతకుడు రామోస్‌ ఫేస్‌బుక్‌లో ముందుగా ప్రకటించి మరీ నరమేధానికి పాల్పడ్డాడు. ఉన్మాది కాల్పుల్లో 19 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. 

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట‍్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా అమెరికాకు చెందిన నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ హూస్ట‌న్‌లో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఈ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. దేశంలోని స్కూళ్ల‌లో భ‌ద్ర‌త‌ను పెంచేందుకు నిధుల‌ను కేటాయించాల‌ని జో బైడెన్‌ సర్కార్‌ను ఆయన కోరారు. మ‌న పిల్ల‌ల్ని కాపాడుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అమెరికాలోని స్కూళ్ల‌ను పిల్ల‌ల‌కు సుర‌క్షితంగా ఉండేలా మార్చుకోవాల‌న్నారు. 

ఈ క్రమంలోనే.. క‌ఠిన తుపాకీ చ‌ట్టాల అమ‌లును ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమను తాము కాపాడుకునేందుకు మాత్రమే ఆయుధాలు ఉపయోగించాలని సూచించారు. అనంతరం.. ప్రపం దేశాలు, ఉక్రెయిన్‌కు నిధులు ఇవ్వడం, రక్షణ కల్పించడం కాదు. అమెరికాలోని స్కూల్స్‌కు నిధులు, రక్షణ కల్పించాలన్నారు. ఇక, ఇరాక్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేశామ‌ని, కానీ అక్క‌డ ఏమీ ల‌భించ‌లేద‌ని ట్రంప్ సంచలన వ్యాఖ‍్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: నీ వల్లే ఇలాంటి పరిస్థితులు మాజీ ప్రధానిపై ఆగ్రహం

మరిన్ని వార్తలు