టిక్‌టాక్‌ : ట్రంప్ మరో ట్విస్టు

19 Aug, 2020 10:53 IST|Sakshi

 టిక్‌టాక్‌ కొనుగోలుకు ఒరాకిల్ కు గ్రీన్ సిగ్నల్

వాషింగ్టన్ : చైనా వీడియో యాప్ టిక్‌టాక్‌ విక్రయానికి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్టు ఇచ్చారు. టిక్‌టాక్‌ను అమెరికా దిగ్గజ టెక్ సంస్థ ఒరాకిల్  కొనుగోలు చేయవచ్చని, ఇది మంచి కంపెనీ అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ గొప్ప సంస్థ, దాని యజమాని అద్భుతమైన వ్యక్తి అని తాను భావిస్తున్నానని, ట్రంప్ మంగళవారం సాయంత్రం విలేకరులతో చెప్పారు. టిక్‌టాక్‌ను నిర్వహించే సామర్థ్యం కచ్చితంగా ఒరాకిల్ సంస్థకు ఉందని తాను నమ్ముతున్నానని తెలిపారు. మరో టెక్ సంస్థ మైక్రోసాప్ట్ ఇప్పటికే ఈ రేసులో ముందున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?)

ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లో టిక్‌టాక్‌ కొనుగోలుకు బైట్‌డ్యాన్స్ తో సంప్రదింపులు జరుపుతోన్న కొంతమంది పెట్టుబడిదారుల సరసన ఒరాకిల్ కూడా చేరిందన్న వార్తల అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాగా జాతీయ భద్రతకు ముప్పు చేస్తోందన్న ఆరోపణలతో ట్రంప్ సర్కార్ టిక్‌టాక్‌పై నిషేధం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ అమెరికా వ్యాపారాన్ని అమెరికాలోని ఏదేని సంస్థకు విక్రయించడమా, లేక నిషేధమా తేల్చుకోమంటూ 90 రోజుల గడువు విధించింది. మరోవైపు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ బైట్‌డాన్స్‌తో చర్చలు జరుపుతోంది. చివరికి ఏ కంపెనీ టిక్‌టాక్‌ను సొంతం చేసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా