‘ఆ ఇడియట్స్‌ మాటలు విని అమెరికన్లు విసిగిపోయారు’

21 Oct, 2020 13:41 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రజారోగ్య సలహాదారు ఆంథోని ఫౌసీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంథోనీ ఫౌసీని ఒక విపత్తు అంటూ ట్రంప్‌ ఎగతాళి చేశారు. ప్రజలు ఫౌసీ మాటలు విని విసిపోయారన్నారు. కరోనా వైరస్‌ గురించి ఫౌసీ ఇతర అధికాలు చెప్పే మాటలను ఉద్దేశించి ట్రంప్‌ మాట్లాడుతూ, ‘ఈ ఇడియట్స్‌ చెప్పే మాటలు అమెరికన్లకు చిరాకు తెప్పించాయి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంథోని ఫౌసీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ట్రంప్‌కు కరోనా వచ్చినప్పుడు  తనకు షాకింగ్‌గా ఏమి అనిపించలేదని, ఎందుకంటే ఆయనకు కరోనా వస్తుందని తనకి ముందే తెలుసునని చెప్పారు.  ఎందుకంటే ఆయన గుంపులో తిరిగేటప్పుడు కూడా మాస్క్‌ను సరిగా పెట్టుకోలేదని, సామాజిక దూరం పాటించలేదని వెల్లడించారు. దీంతో ఫౌసీపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఇడియట్స్‌ మాటలు విని ప్రజలు విసిగిపోయారు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

ఇక డెమెక్రటిక్‌ పార్టీ తరుపున అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న బిడెన్‌ ఫౌసీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని ప్రశంసించారు. ఇక ఆయన ట్రంప్‌ మీద విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ బాధ్యతారాహిత్యం కారణంగా ఆయనతో పాటు చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని  విమర్శించారు. బిడెన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్స్‌ను నమ్మడంతో ట్రంప్‌ పౌసీని ఒక విపత్తు అని మిగిలిన అధికారులను  ఇడియట్స్‌ అని సంభోదించారు.  

చదవండి:లైవ్‌లో ప్రధాని, కంపించిన భూమి

మరిన్ని వార్తలు