టిక్‌టాక్‌ : ట్రంప్ తాజా డెడ్‌లైన్‌

4 Aug, 2020 08:25 IST|Sakshi

అమ్మకమా? మూసివేతా? ఆరువారాల గడువు

వాషింగ్టన్ : చైనాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌’ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్‌ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు.  (మైక్రోసాఫ్ట్‌ ‘టిక్‌టాక్‌’ షో!)

టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు.  మైక్రోసాఫ్ట్ , లేదా మరో పెద్ద సంస్థ ఏదైనా తనకు అభ్యంతరం లేదు కానీ సురక్షితమైన అమెరికన్ సంస్థ కావాలి అని ట్రంప్ అన్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదని తెలిపారు. అలాగే ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని చెప్పారు. మరోవైపు టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని, సమాచార భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు