ట్యునీసియా కేబినెట్‌లో రికార్డు స్థాయిలో మహిళలు

12 Oct, 2021 05:51 IST|Sakshi

ట్యునిస్‌: ఆఫ్రికా దేశం ట్యునీసియాలో కొత్తగా ఏర్పాటైన కేబినెట్‌లో అత్యధిక సంఖ్యలో మహిళలకు చోటు దక్కింది. అధ్యక్షుడు కైస్‌ సయీద్‌ దాదాపు రెండు నెలల క్రితం అప్పటి కేబినెట్‌ను బర్తరఫ్‌ చేసి, సర్వాధికారాలను చేజిక్కించుకున్నారు. సెప్టెంబర్‌ 29వ తేదీన ఆయన ప్రధాని పదవికి నజ్లా బౌడెన్‌ పేరును ప్రతిపాదించారు. తాజాగా, దేశానికి ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బౌడెన్‌ 24 మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రధానితో కలిపి అత్యధిక సంఖ్యలో 10 మంది మహిళలే ఉండటం గమనార్హం. అవినీతిపై పోరాటమే తమ లక్ష్యమని సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బౌడెన్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు