ఇస్తాంబుల్​ బిజీ వీధిలో భారీ బాంబు పేలుడు: పోలీసుల అదుపులో అనుమానితుడు

14 Nov, 2022 08:36 IST|Sakshi

అంకారా: టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటన.. ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆదివారం సాయంత్రం ఇస్తిక్‌లాల్ అవెన్యూ రద్దీ మార్కెట్‌లో పేలుడు సంభవించగా.. ఆ ధాటికి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక ఈ పేలుడు ఘటనలో మరో 81 మంది గాయపడ్డారు. అయితే..

ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ ఉండే ఆ వీధిలో సదరు దుండగుడు బాంబును వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడి అరెస్ట్‌ విషయాన్ని టర్కీ మంత్రి సులేమాన్‌ సోయ్లూ సోమవారం ధృవీకరించారు.

మరోవైపు ఈ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్.. ఇదొక ఉగ్రవాద దాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారాయన.  ఇదిలా ఉంటే.. 2015-2016లో ఇస్తిక్‌లాల్‌ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.


ఇదీ చదవండి: ఇస్తాంబుల్‌ పేలుడు.. చెవులు పగిలిపోయేలా సౌండ్‌

మరిన్ని వార్తలు