Turkey-Syria earthquakes: శిథిలాల కింద 12 రోజులు...

20 Feb, 2023 05:10 IST|Sakshi

ప్రాణాలతో భార్యాభర్తలు, కుమారుడు మృతి

అన్‌టాకియా: తుర్కియే, సిరియాను భూకంపం కుదిపేసి 12 రోజులు గడుస్తున్నా ఇంకా కొందరు శిథిలాల కింద నుంచి మృత్యుంజయులుగా బయట పడుతున్నారు. హతాయ్‌ ప్రావిన్స్‌లోని అన్‌టాకియా నగరంలో కుప్పకూలిన అపార్ట్‌మెంట్‌ శిథిలాల కింద 296 గంటలుగా ఇరుక్కున్న ఒక కుటుంబంలో ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు.

సిమెంట్‌ పెళ్లల కింద క్షణమొక యుగంలా గడిపిన ఒక కుటుంబంలోని ముగ్గురి మూలుగులు ఉన్న సహాయ సిబ్బంది వారిని బయటకి తీశారు. వీరిలో భార్యాభర్తలిద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ఉంటే వారి 12 ఏళ్ల కుమారుడి ప్రాణాలు మాత్రం వైద్యులు కాపాడలేకపోయారు. రెండు దేశాల్లోనే భూకంప మృతుల సంఖ్య 44 వేలు దాటింది. తుర్కియేలో మొత్తం 11 ప్రావిన్స్‌లకు గాను రెండు తప్ప తొమ్మిది ప్రావిన్స్‌లలో సహాయ చర్యలు నిలిపివేసినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.   

భూకంప బాధితుల కోసం అమెరికా నుంచి వచ్చిన సహాయ సామగ్రిని టర్కీలోని అడెనా ఎయిర్‌ బేస్‌ వద్ద ట్రక్కుల్లోకి చేరేయడంలో యూఎస్‌ సైనిక సిబ్బందికి సాయం చేస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌. భూకంప ప్రభావిత ప్రాంతాలను ఆదివారం ఆయన ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. 

మరిన్ని వార్తలు