వైరల్ స్టోరీ : ‘దేవుడు కరుణిస్తే.. అమ్మను చూస్తా’

6 Jun, 2021 14:25 IST|Sakshi

సోషల్ మీడియాతో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు. చూపులేకున్నా తన టాలెంట్​తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు బిలాల్​ గోరెజెన్​. ఒకప్పుడు వీధుల్లో డ్రమ్స్​ వాయించే బిలాల్​కు ఈ క్రేజ్​ దక్కడానికి కారణం.. తెగ ఊగిన ఓ పిల్లితో ఉన్న అతని వీడియో ఒకటి వైరల్ కావడమే.
 
టర్కీకి చెందిన బిలాల్ వయసు 33 ఏళ్లు. పుట్టుకతోనే అంధుడు. కానీ, డ్రమ్స్​ నేర్చుకుని వీధుల్లో వాయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 2011లో ఓ సెస్​ టర్కీ అనే రియాలిటీ షో అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ, ఆర్థికంగా మాత్రం సాయం అందించలేదు. రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్ మేయర్​ ఎక్రెమ్​తో కలిసి చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ‘లెవన్​ పొల్​క్కా’ వీడియో అతని నుదుటిరాతను పూర్తిగా మార్చేసింది.

A post shared by Bilal Göregen (@bilalgoregen)

పిల్లి తెచ్చిన లక్​
లెవాన్​ పొల్​క్కా ఒక ఫిన్​లాండ్​ పాపులర్​ సాంగ్. ఆ సాంగ్​ను తనకొచ్చిన రీతిలో పాడుతూ.. డ్రమ్స్​ వాయించాడు బిలాల్​. అయితే ఆ వీడియోకు జపాన్​ వైబింగ్​ క్యాట్(పిల్లి సరదాగా తల ఊపిన వీడియో)ను ఎడిట్ చేయడంతో అది బాగా పేలింది. సోషల్ మీడియాలో బిలాల్​కు పేరు దక్కింది. ఆ వీడియో తర్వాత బిలాల్​ ఎన్నో ఫేమస్​ పాటలకు డ్రమ్స్ వాయించాడు. మన వరకు బాలీవుడ్​ ‘ఖలియో కా ఛమన్’, దలేర్ మెహందీ ’తున్​క్​ తున్​క్​ తున్​’ ఆల్బమ్స్​, లేటెస్ట్​గా త్రీ ఇడియెట్స్​లో ‘ఆల్​ ఈజ్​ వెల్​’తో ఇండియన్స్​ను బిలాల్​ ఆకట్టుకోగలిగాడు. షకీరా ఆల్బమ్స్​ను సైతం తన స్టయిల్​లో కంపోజ్​ చేశాడతను. ఇక పాపులర్ పాప్​ సాంగ్స్​తో పాటు టీవీ సిరీస్​ల థీమ్​ సాంగ్​లను నోటితో హమ్మింగ్​ చేస్తూ డ్రమ్స్​ వాయిస్తాడు బిలాల్​.

A post shared by Bilal Göregen (@bilalgoregen)

దేవుడంటే కోపం లేదు
బిలాల్ ఇంటర్నెట్​ సెలబ్రిటీ అయ్యాక ఈమధ్య ఓ టీవీ షోలో పాల్గొన్నాడు.​ అందులో యాంకర్​ దేవుడు కరుణించి వరాలిస్తే ఏం కోరుకుంటావని బిలాల్​ను అడిగాడు. దానికి బిలాల్​ స్పందిస్తూ.. ‘‘మా అమ్మ ముఖం చూడాలని ఉందని చెప్తా. ఆమె నన్ను కన్నదని ఈ మాట చెప్పట్లేదు. కానీ, నా అవిటితనపు బాధను ఆమె అనుభవించింది. కన్నీళ్లు కార్చింది. ఆ బాధను మోస్తున్నప్పుడు ఆమె ముఖం చూడాలన్నదే నా కోరిక’’ అని చెప్పాడు. పనిలో పనిగా రంగులు చూడాలన్న కోరికను కూడా అడిగేస్తానని చెప్పాడు. నాకు ఆ భగవంతుడి మీద నాకెలాంటి కోపం లేదు. ఎందుకంటే నా జీవితమే నాకు గొప్ప అని చెప్పడంతో అక్కడున్న ఆడియెన్స్ నిల్చుని​ చప్పట్లతో బిలాల్​ పట్ల గౌరవం ప్రదర్శించారు.

A post shared by Bilal Göregen (@bilalgoregen)

మరిన్ని వార్తలు