World Tallest Living Woman: అమేజింగ్‌.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!

13 Oct, 2021 18:07 IST|Sakshi

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సులో సజీవంగా ఉన్నపొడవైన మహిళ

టర్కీ: టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా అవతరించారు. అంతే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను సజీవంగా ఉన్న పొడవైన మహిళగా పేర్కొంది. రుమేసా 7.07 ఫీట్ల (215.16 సెం.మీ) పొడవుంది. ఆమె అసాధారణమైన పెరుగుదలకు కారణం వీవర్స్‌ సిండ్రోమ్‌ అని వైద్య నిపుణలు వెల్లడించారు. ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతగా పేర్కొన్నారు.

(చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!)

దీంతో  ఆమె అసాధారణంగా పెరగడమే కాక చేతులు 24.5 సెంటిమీటర్లు, పాదాలు 30.5 సెం.మీ. పొడవు ఉన్నట్లు వివరించారు. దీంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడటమే కాక అనేక శారీరక సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈ మేరకు ఆమె ఎక్కువగా వీల్‌ చైర్‌ లేదా వాకింగ్‌ ఫ్రేమ్‌ సాయంతో నడుస్తోంది.

ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. 'ప్రతి ప్రతికూలత మనకు ప్రయోజనకారే మీరు, మీ సామర్థ్యాన్ని గుర్తించండి' అంటూ ఒకరూ.. మరొకరేమో గుంపులో ఒకరుగా కాక మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన వ్యక్తిగా ఉంటారంటూ’ నెటిజన్లు రకరకాలుగా ఆమెకి ధైర్యం నూరిపోస్తు ప్రోత్సహిస్తున్నారు.

(చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్‌​ కాంప్లెక్స్‌)

మరిన్ని వార్తలు