ఉక్రెయిన్‌ ఈజ్‌ బ్యాక్‌.. రష్యా వార్‌లో పుతిన్‌కు ఊహించని ఎదురుదెబ్బ!

11 Sep, 2022 19:25 IST|Sakshi

కొద్దినెలలుగా ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కారణంగా ఉక్రెయిన్‌ భారీగా నష్టపోయింది. ప్రాణ, భారీ ఆస్తి నష్టాన్ని చవిచూసింది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ సైన్యం మాత్రం.. రష్యా దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంది. 

కాగా, తాజాగా రష్యాకు ఉక్రెయిన్‌ సేనలు భారీ షాకిచ్చాయి. ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖర్జీవ్‌ ప్రావిన్స్‌లోని ఇజియంను రష్యా నుంచి ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా రష్యా సైన్యం తమ ఆధీపత్యం చేలాయిస్తూ ఆధీనంలోకి తీసుకున్నాయి. తాజాగా రష్యాకు షాకిస్తూ ఉక్రెయిన్‌ తమ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ ప్రాంతం ఉక్రెయిన్‌ ఆధీనంలోకి వెళ్లడం ఆ దేశానికి కీలక పరిణామంగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తమ లక్ష్యం నెరవేరేంత వరకు ఉక్రెయిన్‌పై తమ సైన్యం దాడి కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఇక, తాజాగా తమ సైన్యం విజయంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ స్పందించారు. ఉక్రెయిన్‌లో ఆక్రమణదారులకు చోటులేదు.. ఉండదు కూడా అని అన్నారు. రష్యా దాడులను ఉక్రెయిన్‌ సైన్యం ధైర్యంగా ఎదుర్కొంది. ఉక్రెయిన్‌ సైన్యం మా దేశంలో కొత్త భాగాలను విముక్తి చేసుకుంటోందని తెలిపారు. ఇజియం స్వాధీనం చేసుకున్న అనంతరం ఉక్రెయిన్‌ సైన్యం తమ దేశ జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకుంది.

మరోవైపు.. రష్యాపై ఆంక్షల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి రష్యన్లకు పోర్చుగల్‌ గోల్డెన్‌ వీసాలను ఇవ్వడంలేదు. ఇప్పటి వరకు ఒక్క రష్యన్‌ పౌరుడి వీసా అభ్యర్థనను కూడా పోర్చుగల్‌ ఆమోదించలేదు. కాగా, రష్యా దాడుల కారణంగా అనేక దేశాలు రష్యా, వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఆర్థిక, పలు రకాల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు