ట్విటర్‌ డీల్‌ బ్రేక్‌.. ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌తో చిక్కుల్లో ఎలన్‌ మస్క్‌!

14 Oct, 2022 09:13 IST|Sakshi

డోవర్‌: టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ చిక్కుల్లో పడ్డారు. సుమారు 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ కొనుగోలుకు ప్రయత్నించి.. ఆయన వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఆయన అధికారిక విచారణ ఎదుర్కొంటున్నట్లు సమాచారం. 

ఈ మేరకు డెలావేర్‌(యూఎస్‌ స్టేట్‌) కోర్టుకు ట్విటర్‌ సమర్పించిన ఒక నివేదిక గురువారం బహిర్గతమైంది. ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విటర్ కొనుగోలుకు సంబంధించి వ్యవహారంలో ఫెడరల్ అధికారులు విచారణలో ఉన్నారు అని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ తరపు న్యాయవాది అక్టోబర్‌ 6వ తేదీన సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. అంతేకాదు.. మస్క్ తరపు న్యాయవాదులు, ఫెడరల్ అధికారులకు సహకరించాలని నెలల తరబడి అభ్యర్థించినప్పటికీ.. సానుకూలంగా స్పందించలేదని ట్విట్టర్ కోర్టుకు నివేదించింది. బంతిని దాచిపెట్టే ఈ ఆట ముగియాలి అంటూ ఆసక్తికరంగా ట్విటర్‌ ఆ ఫైలింగ్‌లో పేర్కొంది.

Tesla CEO ఎలన్‌ మస్క్‌ ఏప్రిల్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చి.. సంచలనానికి తెర లేపాడు. అయితే జులైలో నకిలీ-స్పామ్ ఖాతాల సంఖ్య గురించి ఆందోళనలతో ఒప్పందానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించి మరో సంచలనానికి దారి తీశాడు.  అయితే.. ట్విటర్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఒప్పందాన్ని బలవంతం చేసే ప్రయత్నంలో భాగంగా.. సదరు బిలియనీర్‌పై దావాతో ప్రతిస్పందించింది.

ఇదీ చదవండి:  ఈ వేస్టు దడ పుట్టిస్తోందిగా!

మరిన్ని వార్తలు