కరోనా వ్యాక్సిన్‌కు ఇద్దరు నర్సులు బలి

6 Jan, 2021 19:30 IST|Sakshi

ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ త‌యారు చేసిన వ్యాక్సిన్  తీసుకున్న నర్సు మృతి కలకలం

విచారణ జరుపుతున్న అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన క‌రోనా వైర‌స్ అంతానికి  వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందన్న ఊరటపై ఇద్ద‌రు న‌ర్సులు మరణించారన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి.  ఫైజర్‌ వ్యాక్సిన్‌  తీసుకున్న​ తరువాత పోర్చుగీసుకు చెందిన నర్సు కన్ను మూసిందన్న భయంనుంచి ఇంకా కోలుకోకముందే మరో నర్సు ప్రాణాలు కోల్పోయిన షాకింగ్‌  ఘటన వెలుగు  చూసింది.  నార్వేలో ఈ  విషాదం చోటు చేసుకుంది.

ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ తీసుకున్న 48 గంటల తర్వాత వీరు హ‌ఠాత్తుగా క‌న్నుమూసారు. దీనిపై మెడిక‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ ద నార్వేజియ‌న్ ఏజెన్సీ, నార్వే నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ విచార‌ణ మొదలుపెట్టింది. అయితే ఈమ‌ర‌ణానికి వ్యాక్సినే కార‌ణ‌మా లేక యాదృచ్ఛికంగా ఈ ఘ‌ట‌న జ‌రిగిందా అన్న‌దానిపై విచార‌ణ జ‌రుపుతామ‌ని నార్వేజియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ మెడిక‌ల్ డైరెక్ట‌ర్ స్టీన‌ర్ మాడ్‌సెన్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం పెద్ద వ‌య‌సు ఉన్న వ్య‌క్తులు మొద‌ట వ్యాక్సిన్ తీసుకుంటుడం వ‌ల్ల  మరణాలు యాదృచ్చికంగా సంభవించే  అవకాశం ఉందని, ఎక్కువ‌గా ఉందని మాడ్‌సెన్ అభిప్రాయ‌ప‌డ్డారు. మరోవైపు  ఫైజ‌ర్ వ్యాక్సిన్ వ‌ల్ల తాము కూడా ఇబ్బంది ప‌డిన‌ట్లు గ‌తంలో కొంత‌మంది వ‌లంటీర్లు  చెప్పినట్టు సమాచారం. కాగా పోర్టోలోని పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్ విభాగంలో పనిచేసే నర్సు సోనియా అసెవెడో (41) అనూహ్యంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే.  ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. మరో ఘనటలో ఫైజర్ వ్యాక్సిన్ అందుకున్న 32 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆసుపత్రిలో చేరినట్టు మెక్సికన్ అధికారులు ఇటీవల వెల్లడించారు.

మరిన్ని వార్తలు