వైరల్‌: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..

28 Jul, 2020 15:07 IST|Sakshi

రెండు భారీ ఏనుగులు సరదాగా పోట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ‘షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్’ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘జసిరి, ఫరాజా అనే రెండు అనాథ ఎనుగులు కెన్యాలోని అంబోసేలి ప్రాంతం నుంచి రక్షించబడ్డాయి. ఈ రెండు ఏనుగులు గుర్రపు ఆటను ఇష్టపడతాయి. మా సంరక్షణలో ఉన్న ఇతర ఏనుగుల వలే కాకుండా ముదురు బూడిద రంగు చర్మంతో ఉన్నాయి. ఈ రెండు ఏనుగులు తెలికపాటి చర్మంతో పాటు రాగి తోక జుట్టు, వెంట్రులు కలిగి ఉన్నాయి. ఇవి ఎప్పుడూ ఒకదాన్ని ఒకటి పోట్లాడుకుంటూ సరదాగా బురదలో ఆడుకుంటాయి’ అని కామెంట్‌ జతచేసింది.

ఈ వీడియోను ట్విటర్‌లో 8 వేల మంది వీక్షించగా, 1500మంది లైక్‌ చేశారు. ఏనుగులు ఆడుకుంటున్న ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇది ఆద్భుతమైన వీడియో’, ‘రెండు ఏనుగులను చూస్తే చాలా సరదా ఉంది’, ‘అవి ఒకదానిపై ఒకటి ప్రేమతో సరదాగా ఆడుకుంటున్నాయి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ కెన్యాలోని అనాధ ఏనుగుల రక్షణ, వన్యప్రాణుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు