అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

24 Apr, 2023 06:33 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో సరస్సులో ఈతకెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ నెల 15వ తేదీన సిద్ధాంత్‌ షా(19), ఆర్యన్‌ వైద్య(20)లు మరికొందరితో కలిసి మొన్రో సరస్సులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈదుతూనే ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు.

అధికారులు ఎంతగా ప్రయత్నించినా వారి జాడ దొరకలేదు. ఈ నెల 18వ తేదీన ఇద్దరి మృతదేహాలు సరస్సులో తేలియాడుతూ కనిపించగా వెలికితీశారు. సిద్ధాంత్, ఆర్యన్‌లు ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ విద్యార్థులని అధికారులు వెల్లడించారు. వీరిద్దరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు