ఓ మై గాడ్..‌ వీరిద్దరూ ఎంత ముద్దుగా ఉన్నారు!

26 Jan, 2021 12:20 IST|Sakshi

ఓ చిన్నారి తన అక్కకు మేకప్‌ వేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ అక్కాచెల్లెళ్లు ఒకరిపట్ల ఒకరూ ప్రేమ కురిపించుకోవడం చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో 11 ఏళ్ల వర్తీ తన అక్కకు మేకప్‌ వేస్తున్న తీరు చూసి నెటిజన్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కలిస్టా అనే యువతి 11 ఏళ్ల చెల్లెలు వర్తీ.. తన అక్కను మేకోవర్‌ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో లైక్స్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ఇప్పటికీ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. (చదవండి: వేధింపులకు తాళలేక టిక్‌టాక్‌ స్టార్‌ ఆత్మహత్య)

‘చాప్ స్టిక్ ఎల్లప్పుడూ అవసరం అంటూ’ కలిస్టా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం ఈ వీడియో షేర్‌ చేసింది. ఇందులో వర్తీ తన అక్క తల దువ్వుతూ.. మేకప్‌ వేసి లిప్‌స్టిక్‌ పెడుతూ కలిస్టాను అందంగా తీర్చిదిద్దుతోంది. ‘ఓ మై గాడ్‌ ఈ అక్కాచెల్లెల్లు ఎంత ముద్దుగా ఉన్నారు’, ‘ఈ వీడియో చాలా బాగుంది’, ‘వర్తీ హేర్‌ స్పెషలిస్టు మాత్రమే కాదు మేకప్‌ కూడా బాగా వేయగలదని నిరూపించుకుంటుంది’ అంటూ నెటిజన్‌లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: ట్రంప్‌ దంపతుల విడాకులు ఖాయమేనా..)

A post shared by KALISTA JAIDE HESCH (@kalistajaideee)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు