గాల్లో ఢీకొట్టుకున్న చిన్న విమానాలు 

14 May, 2021 20:59 IST|Sakshi
ప్రమాదానికి గురైన విమానాలు

వాషింగ్టన్‌ : గాల్లో ప్రయాణిస్తున్న రెండు చిన్న విమానాలు ఢీకొట్టుకున్న ఘటన అమెరికాలోని కొలరాడోలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. బుధవారం సర్రస్‌ ఎస్‌ఆర్‌-22 ఇద్దరు ప్రయాణికులతో.. స్వియర్‌ ఇంజిన్‌ మెట్రోలైనర్‌ ఎస్‌ఏ226టీసీ ఒక ప్రయాణికుడితో ఆకాశంలోకి చేరాయి. ఉదయం 10:25 ప్రాంతంలో సెంటెన్నియల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో రెండూ ఢీకొట్టుకున్నాయి. సర్రస్‌ ఎస్‌ఆర్‌-22 ప్యారాచూట్‌ సహాయంతో సురక్షితంగా భూమిపై ల్యాండ్‌ అయింది. స్వియర్‌ ఇంజిన్‌ మెట్రోలైనర్‌ ఎస్‌ఏ226టీసీ ఎమర్జన్సీ ల్యాండింగ్‌ డిక్లేర్‌ చేసి, క్షేమంగా భూమిపైకి చేరింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు