బాబోయ్‌..! రెండస్థుల భవనాన్ని అమాంతం మింగేసిన సము​ద్రం

31 Jul, 2021 20:09 IST|Sakshi

సోషల్ మీడియాను వాడుతున్న యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందులో పలు వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరికొన్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట దూసుకుపోతుంది. ఓ ఇల్లు ఒక్కసారిగా సముద్రంలో కుప్పకూలింది. ఆ ఇల్లు కూలినట్లు గాక సముద్రమే మింగేసిందా? అనేలా ఉన్న ఈ వీడియో చూస్తున్నంతసేపు మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. 

జూలై 28న అర్జెంటినాలోని బ్యూనస్ ఎయిర్స్‌లోని మార్ డెల్ తుయులో ఈ ఘటన చోటుచేసుకుంది. స‌ముద్రంలో నీటిమ‌ట్టం అంత‌కంత‌కూ పెర‌గ‌డంతో తీరం సమీపాన ఉన్న ఓ రెండస్థుల భ‌వ‌నం పునాదులు పూర్తిగా దెబ్బ‌తింది. దీంతో ఒక్కసారిగా ఆ  రెండస్థుల భవనం సముద్రంలోకి కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరని, పెను ప్రమాదం తప్పిందని అర్జెంటినా మీడియా వెల్లడించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా తీర ప్రాంతం కోత‌కు గుర‌వుతున్న కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.


 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు