‘డబ్ల్యూడబ్ల్యూఈ’ని తలపించేలా నడి రోడ్డులో మహిళల ఫైట్‌

1 Oct, 2022 18:10 IST|Sakshi

రద్దీగా ఉన్న రోడ్డులో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. టాప్స్‌, షార్ట్స్‌ ధరించిన ఇద్దరు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకపడ్డారు. పక్క నుంచి వాహనాలు వెళ్తున్నా పట్టించుకోలేదు. జుట్టు పట్టుకుని లాక్కెళుతూ కాళ్లతో తంతూ పట్టువీడని విక్రమార్కుల్లా ప్రవర్తించారు. చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నా ‍ప్రేక్షకపాత్ర వహించారే తప్పా.. ఏ ఒక్కరూ వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. ఇద్దరు మహిళల మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ పోటీని తలపించే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

వీడియో ప్రకారం.. ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని తీవ్రంగా కొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఈ ఫైట్‌లో ఎవరు గెలిచారో స్పష్టంగా తెలియదు. వీడియోను ‘విసియస్‌ వీడియోస్‌’ అనే ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా తెగ వైరల్‌గా మారింది. ఆవేశపు పిడికిలి అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళలు ఫైట్‌ చేసిన వీడియో సైతం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: విద్యార్థిని చితకబాదిన టీచర్‌.. గొంతునొక్కుతూ, జుట్టుపట్టుకుని..

మరిన్ని వార్తలు